Site icon HashtagU Telugu

Realme GT Neo 5 Launch: రియల్ మీ కొత్త స్మార్ట్ ఫోన్ లో అద్భుతమైన ఫీచర్లు.. 9 నిమిషాల్లోనే ఫుల్ ఛార్జ్?

Realme Gt Neo 5 Launch

Realme Gt Neo 5 Launch

స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు ఒక శుభవార్త. అదేమిటంటే ఇప్పటివరకు మార్కెట్లోకి విడుదల అయిన మరే ఇతర ఫోన్ లో లేని ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి విడుదల కానుంది. పవర్‌ఫుల్ స్పెసిఫికేషన్స్‌తో రియల్‌ మీ కొత్త స్మార్ట్‌ ఫోన్‌ను మార్కెట్‌ లోకి విడుదల చేయబోతోంది. కాగా ఈ అప్‌ కమింగ్ స్మార్ట్‌ ఫోన్ కి సంబంధించిన కొన్ని ఫీచర్లు లీక్ అయ్యాయి. ఈ స్మార్ట్ ఫోన్ మునుపెన్నడూ లేని ఫీచర్లతో రాబోతోందని తెలుస్తోంది. రియల్ మీ సంస్థ త్వరలో మార్కెట్‌ లోకి తీసుకురానున్న స్మార్ట్‌పోన్ రియల్‌ మీ జీటీ నియో 5. ఈ ఫోన్ ఫీచర్లు ఇప్పుడు లీక్ అయ్యాయి. ఇందులో అదిరిపోయే బ్యాటరీ స్పీడ్ ఉండనుందని తెలుస్తోంది.

రియల్‌మీ జీటీ నియో 3 స్మార్ట్‌ఫోన్‌ ఈ ఏడాది మార్చిలో విడుదల అయిన విషయం తెలిసిందే. రియల్‌మీ జీటీ నియో 5 ఫోన్‌ను ఈ సీరిస్‌లోనే తీసుకువచ్చే ఛాన్స్ ఉంది. ఈ సిరీస్ కింద మార్కెట్‌ లోకి వచ్చిన రెండు ఫోన్లలో 150 వాట్ చార్జింగ్ స్పీడ్ ఉంది. 50 శాతం బ్యాటరీ 5 నిమిషాల్లో, 100 శాతం బ్యాటరీ 15 నిమిషాల్లో పూర్తి అవుతోందని ఇక ఇప్పుడు వచ్చే నియో 5 ఫోన్‌లో ఇంతకు మించి ఫీచర్ల ఉండబోతున్నాయని తెలుస్తోంది. ఇకపోతే తాజాగా రియల్‌మీ జీటీ నియో 5 స్మార్ట్‌ఫోన్‌ కి సంబంధించిన లీకుల వివరాల విషయానికొస్తే.. ఈ ఫోన్ 2023 తొలి త్రైమాసికంలో మార్కెట్‌లోకి విడుదల అయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది కాగా ఈ సిరీస్‌లో వచ్చే స్మార్ట్‌ ఫోన్స్‌లో సోనీ ఐఎంఎక్స్890 సెన్సార్, ఓఐఎస్ సపోర్ట్ వంటి ఫీచర్ లను కలిగి ఉండనుందట.

అదేవిధంగా ఒకదానిలో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, మరో దానిలో 4600 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థం కలిగి ఉండనున్నాయట. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఫోన్‌లో 150 వాట్ చార్జింగ్ స్పీడ్ ఉండే ఛాన్స్ ఉంది. అలాగే 4600 ఎంఏహెచ్ బ్యాటరీ ఫోన్‌లో 240వాట్ చార్జింగ్ స్పీడ్‌ ఉండొచ్చు. కాగా 240 వాట్ చార్జింగ్ సపోర్ట్‌తో వస్తున్న తొలి ఫోన్ ఇదే కానుంది. కాగా ఒప్పొ ఇప్పటికే 240 వాట్ సూపర్ వూక్ ఫ్లష్ చార్జ్‌ను మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2022లో ఆవిష్కరించగా, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ కేవలం 9 నిమిషాల్లోనే ఫుల్ అయ్యింది. కేవలం ఒప్పొ మాత్రమే కాకుండా ఐకూ కూడా 200 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఫీచర్‌ను తీసుకువస్తోంది.

Exit mobile version