రియల్ మీ స్మార్ట్ ఫోన్ ని కొనుగోలు చేయాలనుకుంటున్నారా, అయితే ఈ అవకాశం మీ కోసమే. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ సంస్థ ఇప్పుడు రియల్ మీ స్మార్ట్ ఫోన్ పై అద్భుతమైన ఆఫర్ ను అందిస్తోంది. వేల రూపాయల డిస్కౌంట్ తో తక్కువ ధరకే అందిస్తోంది. ఇంతకీ ఆ స్మార్ట్ ఫోన్ ఏది? ఎంత డిస్కౌంట్ లభిస్తోంది అన్న వివరాల్లోకి వెళితే.. ఫ్లిప్‌కార్ట్ లో రియల్‌మి జీటీ 7 ప్రో పై భారీగా డిస్కౌంట్ ని అందిస్తోంది. ఈ ఫోన్ కేవలం ఒక నెల క్రితమే లాంచ్ అయింది. అయితే ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ లో ఈ ప్రో ఫోన్ ధర భారీగా తగ్గింది. కాగా ఈ ఫోన్ అసలు ధర రూ. 59,999 ఉండగా, ఇప్పుడు ఈ ఫోన్ ధర రూ. 56,999 కి అందుబాటులో ఉంది. అదనపు షరతులు లేకుండా రూ. 3 వేలు ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది.
అయితే ఈ ఆఫర్ బ్లాక్ కలర్ వేరియంట్ కే పరిమితమని గమనించాలి. రియల్ మీ జీటీ 7ప్రో ఫోన్ ఫ్లిప్‌కార్ట్ లో భారీ డిస్కౌంట్ అందిస్తోంది. రియల్ మీ జీటీ 7 ప్రో ప్రీమియం డిజైన్, పర్ఫార్మెన్స్, ఆకట్టుకునే బ్యాటరీ లైఫ్ అందిస్తోంది. లేటెస్ట్ క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్ ఆధారితంగా పని చేస్తుంది. బలమైన గేమింగ్ పర్ఫార్మెన్స్, మృదువైన మల్టీ టాస్కింగ్ ను అందిస్తుంది. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ హీటింగ్ సమస్యను మెరుగుపరచడమే కాకుండా పర్ఫార్మెన్స్ థ్రోట్లింగ్ ను తగ్గిస్తుంది. ఈ ఫోన్ బ్యాటరీ లైఫ్ ఎక్కువకాలం మన్నికను కలిగి ఉంటుంది. బెంచ్‌మార్క్ పరీక్షలో 20 గంటల పాటు 5,800mAh బ్యాటరీని కలిగి ఉంది. వాస్తవంగా వినియోగిస్తే దాదాపు 9 గంటల స్క్రీన్ సమయాన్ని అందిస్తుంది. ఈ ఫోన్ దాదాపు ఒక రోజు పాటు ఉంటుంది. అదనంగా 120డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ సౌలభ్యంతో పాటు వేగంగా రీఛార్జ్ అవుతుంది.
1.5కె రిజల్యూషన్ తో కూడిన 6.78 అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే మరో హైలైట్. 120Hz రిఫ్రెష్ రేట్, 6,500నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, కార్నింగ్ గ్లాస్ 7ఐ ప్రొటెక్షన్ అందిస్తుంది. డిస్‌ప్లే పవర్‌ఫుల్ విజువల్స్, స్క్రోలింగ్‌ను అందిస్తుంది. మీరు ఇంటి లోపల లేదా ఆరుబయట ఉన్నా డిస్‌ప్లే ప్రకాశవంతంగా ఉంటుంది. రియల్‌మి జీటీ 7 ప్రో కూడా ఐపీ69 రేట్ అయింది. ఐఫోన్‌లతో సహా ఇతర ప్రీమియం స్మార్ట్‌ఫోన్ లతో పోలిస్తే నీరు, ధూళికి మరింత మన్నికైనదిగా చెప్పవచ్చు. కెమెరా ముందు, రియల్‌మి జీటీ 7 ప్రో వెలుతురు ఉన్న పరిస్థితుల్లో బిగ్ షాట్‌లను అందిస్తుంది. అల్ట్రావైడ్ కెమెరా అసాధారణమైనది. మొత్తం మీద, కెమెరా పర్ఫార్మెన్స్ మంచి కాంతిలో బాగానే ఉంది. కానీ, ధరలో ప్రత్యేకంగా ఉండదు. రియల్‌మి జీటీ 7 ప్రో ఫోన్ కూడా మునుపటి జీటీ 6 సిరీస్ కన్నా అద్భుతమైన ఆప్షన్లను అందిస్తుంది. కొత్త మాట్టే ఎండ్ బ్యాక్ ప్యానెల్ ముఖ్యంగా బ్లాక్ కలర్ వేరియంట్ లో క్లాసీ, సూక్ష్మ రూపాన్ని అందిస్తుంది. వెనుకవైపు పెద్ద దీర్ఘచతురస్రాకార కెమెరా మాడ్యూల్ స్టైలిష్ టచ్ ను అందిస్తుంది. ఈ ఫోన్ ఫ్లాట్ ఫ్రేమ్ లు, కొద్దిగా కర్వడ్ ఎడ్జ్ లతో ఫోన్ పట్టుకోవడం సౌకర్యంగా ఉంటుంది. రియల్‌మి జీటీ 7ప్రో ఇటీవలి ధర తగ్గింపుతో డిజైన్, పర్ఫార్మెన్స్ అందిస్తుంది. నియోగదారులు కెమెరా పర్ఫార్మెన్స్ మంచిదే కానీ, టాప్-టైర్ కాదని గమనించాలి. ఈ ఫోన్‌లో వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ లేదు. రియల్‌మి జీటీ 7 ప్రో బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.