Realme GT 3: మార్కెట్లోకి రియల్ మీ కొత్త స్మార్ట్.. కేవలం 9 నిముషాల్లో ఫుల్ ఛార్జ్?

దేశవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ వినియోగదారుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. అయితే ఈ మధ్యకాలంలో స్మార్ట్ ఫోన్

  • Written By:
  • Publish Date - February 23, 2023 / 07:30 AM IST

దేశవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ వినియోగదారుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. అయితే ఈ మధ్యకాలంలో స్మార్ట్ ఫోన్ లవర్స్ ఎక్కువగా కెమెరా, బ్యాటరీల పైన ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. బ్యాటరీ బ్యాకప్‌, ఛార్జింగ్‌ స్పీడ్‌ కోరుకుంటున్నారు. దాంతో చాలా కంపెనీలు కొత్త ఫోన్‌లలో బెటర్‌ బ్యాటరీ లైఫ్‌, ఛార్జింగ్‌ స్పీడ్‌ ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కొత్త కొత్త ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూనేఉన్నాయి. ఇకపోతే త్వరలోనే మార్కెట్ లోకి రియల్‌ మీ నుంచి కేవలం 9 నిమిషాల్లో ఛార్జింగ్‌ పూర్తయ్యే ఫోన్‌ రాబోతుంది. బార్సిలోనా వేదికగా ఫిబ్రవరి 28న జరగనున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2023లో రియల్ తన లెటెస్ట్ స్మార్ట్‌ఫోన్ జీటీ 3ను ప్రదర్శించనుంది.

అయితే అంతకంటే ముందుగానే ఓ వీడియో ద్వారా రియల్‌మీ జీటీ 3 స్మార్ట్‌ఫోన్‌ 240W వైర్డ్ ఛార్జింగ్ స్పీడ్‌ను డెమాన్‌స్ట్రేట్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ డిజైన్‌ రియల్‌మీ జీటీ నియో 5 మాదిరిగా ఉంది. కాగా రియల్‌ మీ జీటీ 3 బాడీ గ్రే కలర్‌లో ఉంది. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కోసం కోసం వెనుక వైపు రెండు పెద్ద కటౌట్స్, సెల్ఫీ కెమెరా కోసం సెంట్రల్‌లో హోల్ పంచ్‌తో కూడిన డిస్‌ప్లే, పవర్ బటన్ ఫోన్ రైట్ సైడ్ ఉండగా, వాల్యూమ్ రాకర్స్ లెఫ్ట్ సైడ్ ను ఇందులో ఇచ్చారు. రియల్ మీ జీటీ 3 ఫోన్ 9 నిమిషాల 30 సెకన్లలో ఫుల్ ఛార్జ్ అనగా 100 శాతం కావడాన్ని ఈ వీడియో హైలైట్ చేసింది. ఇక 4 నిమిషాల్లో 50 శాతం వరకు, ఒక నిమిషం ఛార్జింగ్ చేస్తే 20 శాతం వరకు ఛార్జ్ అవుతుందని వీడియో ద్వారా కంపెనీ వెల్లడించింది. ఈ రియల్‌మీ జీటీ 3 ఫోన్ 4,600mAh బ్యాటరీ సామర్ధ్యమును కలిగి ఉండనుంది.

ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే.. రియల్ మీ జీటీ 3 స్పెసిఫికేషన్స్ ఇంకా వెల్లడి కాలేదు కానీ జీటీ నియో 5తో సమానంగా ఉంటాయని భావిస్తున్నారు. దాంతో ఆ ఫోన్ అంచనా వేస్తూ కొన్ని రకాల స్పెసిఫికేషన్లు ఉండవచ్చని భావిస్తున్నారు. దీంతో జీటీ 3లో 144Hz రిఫ్రెష్ రేట్‌తో 10 బిట్ 6.74 అంగుళాల AMOLED డిస్‌ప్లే ఉండే అవకాశం ఉంది. ఫోన్ వెనుకవైపు 50 మెగాపిక్సెల్ సోనీ IMX890 ప్రైమరీ సెన్సార్ ఉండవచ్చు. ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉండవచ్చు. ఇందులో Qualcomm స్నాప్‌డ్రాగన్ 8 Gen 1 SoC చిప్‌సెట్‌ను వినియోగించి ఉండవచ్చు. భారత్లో ఎప్పుడు లాంచ్ కానున్నది అన్న విషయంపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.