Site icon HashtagU Telugu

Realme C53: మార్కెట్ లోకి మరో రియల్ మీ స్మార్ట్ ఫోన్.. ధర, ఫీచర్స్ ఇవే?

Realme C53

Realme C53

ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్‌మీ సంస్థ గురించి మనందరికీ తెలిసిందే. ఇప్పటికే మార్కెట్ లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. వినియోగదారులను ఆకర్షించడం కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్ లతో అతి తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్ లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా రియల్‌మీ సంస్థ మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి విడుదల చేసింది. సీ సిరీస్‌లో రియల్‌మీ సీ53 మోడల్‌ని విడుదల చేసింది. మరి ఈ స్మార్ట్ ఫోన్ ధర, స్పెసిఫికేషన్ ల విషయానికి వస్తే.. రియల్‌మీ సీ53 స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్ లలో లాంఛ్ అయింది.

4జీబీ ర్యామ్ 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9,999 కాగా, 6జీబీ ర్యామ్ 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999 గా ఉంది. ఇవి ఇంట్రడక్టరీ ధరలు మాత్రమే. జూలై 26న సేల్ ప్రారంభం అవుతుంది. రియల్‌మీ అధికారిక వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్‌లో, రీటైల్ స్టోర్లలో ఈ మొబైల్ కొనుగోలు చేయవచ్చు. రియల్‌మీ అధికారిక వెబ్‌సైట్‌లో ఎర్లీ బర్డ్ సేల్ జూలై 19 సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు జరుగుతుంది. రియల్‌మీ సీ53 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే.. ఇందులో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.74 అంగుళాల డిస్‌ప్లే ఉంది. ఆక్టాకోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 6జీబీ వరకు ర్యామ్, 128జీబీ వరకు స్టోరేజ్ సపోర్ట్ ఉంది.

డైనమిక్ ర్యామ్ ఫీచర్‌తో 12జీబీ వరకు ర్యామ్ ఉపయోగించుకోవచ్చు. మెమొరీ కార్డుతో 2టీబీ వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు. రియల్‌మీ సీ53 మొబైల్‌లో డ్యూయెల్ కెమెరా సెటప్ ఉంది. 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా సెకండరీ సెన్సార్‌తో వెనుకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8మెగాపిక్సెల్ ఏఐ సెల్ఫీ కెమెరా ఉంది. వీడియో, పోర్ట్‌రైట్ మోడ్, బ్యూటీ మోడ్, హెచ్‌డీఆర్, ఫేస్ రికగ్నిషన్, ఫిల్టర్, బొకే ఎఫెక్ట్ కంట్రోల్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. రియల్‌మీ సీ53 స్మార్ట్‌ఫోన్‌ 5,000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యాన్ని కూడా కలిగి ఉండనుంది. అలాగే 18వాట్ క్విక్ ఛార్జ్ సపోర్ట్ చేస్తుంది. డ్యూయెల్ సిమ్, మైక్రో ఎస్‌డీ కార్డ్ సపోర్ట్, యూఎస్‌బీ టైప్ సీ సపోర్ట్, బ్లూటూత్ 5.0 లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ మనకు షాంపైన్ గోల్డ్, షాంపైన్ బ్లాక్ వంటి కలర్స్‌లో లభించనుంది.