Site icon HashtagU Telugu

Realme 13 Pro: భారత్ లోకి విడుదల కాబోతున్న రియల్ మీ కొత్త ఫోన్.. లాంచింగ్ అయ్యేది అప్పుడే!

Mixcollage 16 Jul 2024 03 28 Pm 240

Mixcollage 16 Jul 2024 03 28 Pm 240

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్ మీ ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. వీటితోపాటు ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది. అందులో భాగంగానే మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ ఇ మార్కెట్ లోకి విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది రియల్ మీ సంస్థ. మరి ఆ వివరాల్లోకి వెళితే.. రియల్ మీ సంస్థ మార్కెట్లోకి తీసుకురాబోతున్న సరికొత్త స్మార్ట్ ఫోన్ పేరు రియల్​మీ 13 ప్రో సిరీస్ 5జీ. ఈ ఫోన్ ఈనెల ఆకరిలో అనగా జూలై 30న భారత్​ లో లాంచ్ కానుంది. రియల్​మీ 13 ప్రో 5జీ, రియల్ మీ 13 ప్రో ప్లస్ 5జీ వంటి స్మార్ట్​ఫోన్స్​ ఉండే ఈ సిరీస్​పై ప్రజల్లో మంచి ఆసక్తి ఉంది.

అయితే ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ స్మార్ట్​ఫోన్ సిరీస్ ఎట్టకేలకు ఈ నెలాఖరుకు ఇండియాలో లాంచ్​కానుంది. లాంచ్​కి ముందు, రియల్​మీ 13 ప్రో సిరీస్ కొన్ని కెమెరా స్పెసిఫికేషన్ లను ఏఐ ఇంటిగ్రేషన్​ తో సంస్థ రివీల్ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే.. అల్ట్రా క్లియర్ కెమెరా విత్ ఏఐ ఫీచర్​ తో ఈ స్మార్ట్​ ఫోన్​ ను ఆవిష్కరించిన కంపెనీ తన మొదటి ఏఐ ఫోటోగ్రఫీ ఆర్కిటెక్చర్ హైపర్ ఇమేజ్+ను ప్రకటించనుంది . రియల్​ మీ 13 ప్రో స్మార్ట్​ఫోన్​ సిరీస్ 5జీ ఇమేజ్ ఇంటిగ్రిటీని పెంచడానికి, సున్నితమైన పరివర్తనలతో నిజమైన లైట్​, షాడోలను సంగ్రహించడానికి ఇమేజ్ ప్రాసెసింగ్​ని రా డొమైన్​ లోకి తీసుకువస్తుందని రియల్​మీ సంస్థ వెల్లడించింది. కాగా రియల్​మీ 13 ప్రో ప్లస్ 5జీ మూడు కలర్ ఆప్షన్ లలో లభిస్తోంది.

అవి మోనెట్ గోల్డ్, మోనెట్ పర్పుల్, ఎమరాల్డ్ గ్రీన్ విత్ వేగన్ లెదర్ ఫినిష్. ఈ ​ఫోన్​లో డ్యూయల్ మెయిన్ కెమెరా సిస్టమ్ ఉంది, ఇందులో సోనీ ఎల్వైటి 701 సెన్సార్​ తో 50 మెగా పిక్సెల్ ఓఐఎస్ ప్రధాన కెమెరా, 3 ఎక్స్ ఆప్టికల్ జూమ్​ తో వచ్చే సోనీ ఎల్వైటి 600 సెన్సార్​ తో 50 మెగా పిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. ఈ స్మార్ట్​ఫోన్స్​ వాటి ఇమేజ్ క్వాలిటీ, పనితీరు కోసం టీయూవీ రీన్లాండ్ హై రిజల్యూషన్ కెమెరా సర్టిఫికేషన్​ ని పొందాయని రియల్ మీ తెలిపింది. ఇందులో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్​తో 6.7 ఇంచ్​ అమోలెడ్ డిస్ప్లే ఉండవచ్చు. ఈ రెండు డివైజ్​లు స్నాప్​డ్రాగన్ 7ఎస్ జెన్ 3 చిప్​సెట్​ తో పనిచేస్తాయని, ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఓఎస్ పై పనిచేయవచ్చని టెక్​ వర్గాలు భావిస్తున్నాయి. కాగా ఇస్మార్ట్ ఫోన్ కి సంబంధించిన మరిన్ని వివరాలు అలాగే ధర వివరాల గురించి ఇంకా తెలియాల్సి ఉంది.