ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్ మీ ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. వీటితో పాటు ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది. అంటే ఒక వైపు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తూనే మరొకవైపు ఇప్పటికే మార్కెట్లోకి విడుదల చేసిన స్మార్ట్ ఫోన్ లపై భారీగా డిస్కౌంట్ ధరలను ప్రకటిస్తూ వినియోగదారులను విపరీతంగా ఆకర్షిస్తోంది. అయితే ఇటీవల కాలంలో ఎక్కువగా అద్భుతమైన ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్ లనే అందిస్తోంది. అందులో భాగంగానే మార్కెట్లోకి తాజాగా.రియల్‌మి 13 4జీ ఫోన్ వచ్చేసింది. 50ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్, స్నాప్‌డ్రాగన్ 685 ఎస్ఓసీ, వైర్డు ఛార్జింగ్ సపోర్ట్, 5,000mAh బ్యాటరీతో వస్తుంది.
కాగా రియల్ మీ 12 సిరీస్‌లో చూసిన అదే లగ్జరీ వాచ్ ప్రేరేపిత డిజైన్‌ను కలిగి ఉంది. రియల్ మీ 13ప్రో 5జీ, రియల్ మీ 13ప్రో ప్లస్ 5జీ కలిగిన రియల్ మీ 13 లైనప్ లో చేరింది. రియల్ మీ 13 5జీ, రియల్ మీ 13 ప్లస్ 5జీ హ్యాండ్ సెట్‌లు కూడా ఇటీవలే సర్టిఫికేషన్ సైట్‌లలో కనిపించాయి. కాగా రియల్ మీ 13 4జీ ఫోన్ 8జీబీ+ 128జీబీ ఆప్షన్ ధర IDR 27,99,000 అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ. 14,700 నుంచి ప్రారంభం అవుతుంది. అయితే, 8జీబీ+ 256జీబీ వేరియంట్ ధర IDR 29,99,000 అనగా రూ. 15,800 గా ఉండనుంది. ఇండోనేషియాలో రియల్ మీ ఇండోనేషియా వెబ్‌సైట్ ద్వారా ఫోన్ కొనుగోలుకు అందుబాటులో ఉంది. కాగా ఈ ఫోన్ మనకు పయనీర్ గ్రీన్, స్కైలైన్ బ్లూ వంటి రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తోంది.
కాగా ఇందులో 13 4జీ ఫోన్ 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోల్డ్ స్క్రీన్ ను 120Hz వరకు రిఫ్రెష్ రేట్, 180Hz టచ్ శాంప్లింగ్ రేట్, 2,000 నిట్స్ గరిష్ట ప్రకాశం స్థాయిని కలిగి ఉంది. డిస్‌ప్లే రెయిన్ వాటర్ స్మార్ట్ టచ్ ఫీచర్ కు సపోర్టు ఇస్తుంది. స్క్రీన్ కు టచ్‌లు, వాటర్ డ్రాప్‌ల మధ్య తేడాను గుర్తించడంలో సాయపడుతుందట. దాంతో తడి చేతులతో కూడా ఈ స్మార్ట్ ఫోన్ వినియోగించవచ్చు. కాగా రియల్ మీ 13 4జీ, అడ్రినో 610 జీపీయూ, 8జీబీఎల్ పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256 జీబీ వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజ్ తో స్నాప్ డ్రాగన్ 685 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. ర్యామ్ వర్చువల్ గా అదనంగా 8 జీబీ వరకు పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 14 ఆధారిత రియల్ మీ యూఐ 5.0తో ఫోన్, ఆప్టిక్స్ విషయానికి వస్తే.. రియల్ మీ 13 4జీ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది.
ఇందులో 50ఎంపీ సోనీ ఎల్‌వైటీ 600 ప్రైమరీ సెన్సార్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్, 2ఎంపీ సెకండరీ సెన్సార్ ఉన్నాయి. ఈ హ్యాండ్ సెట్ లోని ఫ్రంట్ కెమెరా 16 ఎంపీ సెన్సార్ ను ఉపయోగిస్తుంది. రియల్‌మి 13 4జీ 67డబ్ల్యూ వైర్డు సూపర్ వూక్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇకపోతే ఈ ఫోన్ కనెక్టివిటీ విషయానికి వస్తే.. ఫోన్‌లో డ్యూయల్ 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్, గ్లోనాస్, బీడౌ, గెలీలియో, క్యూజెఎస్ఎస్, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ లు ఉన్నాయి. స్ప్లాష్ నిరోధకతకు ఐపీ64 రేటెడ్ బిల్డ్‌తో వస్తుంది. ఈ హ్యాండ్ సెట్ లో ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అమర్చి ఉంది. రియల్ టైమ్ హృదయ స్పందన రేటును కూడా గుర్తించగలదు. ఈ ఫోన్ పరిమాణం 162.95 x75.45x 7.92 మిమీ, బరువు 187 గ్రాములు ఉంటుంది.