Site icon HashtagU Telugu

Realme: రియల్ మీ స్మార్ట్ ఫోన్‌పై కళ్ళు చెదిరే ఆఫర్స్.. ధర, ఫీచర్స్ ఇవే?

Mixcollage 24 Dec 2023 01 48 Pm 926

Mixcollage 24 Dec 2023 01 48 Pm 926

ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా ఇయర్ రెండు సేల్ నడుస్తోంది. ఈ ఏడాది ముగియడానికి మరొక ఆరు రోజులు మాత్రమే సమయం ఉండడంతో మొబైల్ ఫోన్లపై కార్లు బైకులపై ఆయా సంస్థలు భారీగా బంపర్ ఆఫర్ లను ప్రకటిస్తున్నాయి. అందులో భాగంగానే ఇప్పటికే ఎన్నో రకాల ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ పై ఆఫర్స్ ను ప్రకటించిన పలు సంస్థలు తాజాగా కూడా రియల్ మీ స్మార్ట్ ఫోన్ పై కళ్ళు చెదిరే ఆఫర్స్ ను ప్రేక్షకుల కోసం తీసుకువచ్చాయి. ఇంతకీ ఆ ఫోన్ ఏది? ఆ ఫోన్ పై ఎంత శాతం తగ్గించారు అన్న వివరాల్లోకి వెళితే..

ఆ సెల్ ఫోన్ మరి ఏదో కాదు రియల్ మీ. ఈ స్మార్ట్ ఫోన్ పై భారీగా బంపర్ ఆఫర్లను ప్రకటించింది ఫ్లిప్కార్ట్. ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం వింటర్ ఫెస్ట్ సేల్ కొనసాగుతోంది. ఈ సేల్ డిసెంబర్ 31 వరకు కొనసాగుతుంది. ఈ సేల్‌లో, వినియోగదారులు రియల్ మీ 11 ప్రో 5జీ పై పెద్ద తగ్గింపులను పొందవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ జూన్‌లో భారతదేశంలో లాంచ్ అయ్యింది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్ బేస్ వేరియంట్ అంటే 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను రూ.25,999 కి బదులుగా రూ.21,999 కి కొనుగోలు చేయవచ్చు. అంటే ఇక్కడ కస్టమర్లకు రూ.4,000 ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తోంది. అదేవిధంగా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌పై కస్టమర్లు 5 శాతం క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చు.

ఇది మాత్రమే కాకుండా కస్టమర్లు తమ పాత ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేసుకోవడం ద్వారా రూ.16,050 వరకు తగ్గింపును కూడా పొందవచ్చు. దీని కోసం, ఫోన్ మంచి స్థితిలో ఉండటం అవసరం. ఫ్లిప్‌కార్ట్‌లో వినియోగదారులకు నో-కాస్ట్ EMI ఆప్షన్లు కూడా ఉన్నాయి. రియల్ మీ 11 ప్రో 5జీ ఫీచర్ల గురించి మాట్లాడితే, ఇది 6.7-అంగుళాల పూర్తి HD+ డిస్ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ మీడియాటేక్ డైమేన్సిటీ 7050 ప్రాసెసర్‌తో వస్తుంది. అలాగే ఈ ఫోన్ వెనుక భాగంలో 100ఎంపీ ప్రైమరీ కెమెరా, 2ఎంపీ సెకండరీ కెమెరా ఉన్నాయి. ఇందులో సెల్ఫీ కోసం 16ఎంపీ కెమెరా ఉంది. ఫోన్ బ్యాటరీ 5000mAhగా ఉంది..