Site icon HashtagU Telugu

Realme 10 Pro: రియల్ మీ 10 ప్రో సిరీస్.. ధర ఫీచర్లు తెలిస్తే వావ్ అనాల్సిందే?

Realme 10 Pro

Realme 10 Pro

చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్‌మీ సంస్థ ఇప్పటికే మార్కెట్ లోకి పలు రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా కూడా మరొక స్మార్ట్ ఫోన్ ని మార్కెట్ లోకి విడుదల చేసింది రియల్‌మీ. రియల్‌మీ నుంచి రియల్‌మి 10 ప్రో సిరీస్ స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. అందులో రియల్‌మీ 10ప్రో అలాగే రియల్‌మీ 10ప్రో ప్లస్ లాంచ్ అయ్యాయి. గ్లోబల్ మార్కెట్లో రెగ్యులర్ రియల్‌మీ 10 స్మార్ట్ ఫోన్ విడుదల చేసిన కొన్ని రోజులకు రెండు కొత్త స్మార్ట్‌ ఫోన్‌లు రిలీజ్ అయ్యాయి. అయితే స్పెసిఫికేషన్‌ల పరంగా రెండూ చాలా భిన్నంగా ఉంటాయి.

రియల్‌మీ 10 ప్రో Qualcomm చిప్‌ సెట్‌తో వస్తుంది. మరో వెర్షన్ MediaTek చిప్‌సెట్‌ తో వస్తుంది. కాగా ఈ రెండు స్మార్ట్ రెండు ఫోన్‌లు 108 ఎంపీ ప్రైమరీ కెమెరా, 5,000mAh బ్యాటరీని కలిగి ఉన్నాయి. రియల్‌మీ 10 ప్రో యూనిబాడీ బ్యాక్ ప్యానెల్, రెండు బ్యాక్ కెమెరాలతో రియల్‌మీ 9ఐ ని పోలి ఉంటుంది. రియల్‌మీ ప్రో స్నాప్‌డ్రాగన్ 695 చిప్‌సెట్‌ను 12జీబీ రామ్ , 256జీబీ స్టోరేజీ తో వచ్చింది.కాగా ఈ ఫోన్ వెనుక కెమెరా సిస్టమ్‌ లో 108 ఎంపీ ప్రైమరీ కెమెరా, కేవలం 2 ఎంపీ డెప్త్ సెన్సార్ ఉన్నాయి. అలాగే సెల్ఫీల కోసం ముందు భాగంలో ఒకే 16ఎంపీ కెమెరా ఉంది.

అందుకే ఫోన్ బేస్ వేరియంట్ 8జీబీ ర్యామ్ , 256జీబీ స్టోరేజ్‌తో వస్తుంది. దీని ధర CNY 1,599 (దాదాపు రూ. 18,200, 12జీబీ ర్యామ్ , 256జీబీ స్టోరేజ్ కలిగిన టాప్ స్టోరేజ్ మోడల్ ధర CNY 1899 అనగా రూ. 21,635 కలిగి ఉంది. వెనుక కెమెరా సిస్టమ్‌లో 108 ఎంపీ ప్రైమరీ కెమెరా, 8 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా, 2 ఎంపీ మాక్రో షూటర్ ఉన్నాయి. ధర 8 జీబీ ర్యామ్ , 128జీబీ స్టోరేజీ ఆప్షన్ కోసం CNY1,699 దాదాపు రూ. 19,300 నుంచి ప్రారంభం కానున్నాడు. 8జీబీ ర్యామ్ , 256జీబీ ఆప్షన్ CNY 1,999 దాదాపు రూ. 22,700, 12జీబీ , 256జీబీ ఆప్షన్ CNY2,399 దాదాపు రూ. 27,300 ధరను కలిగి ఉంటుంది.