Site icon HashtagU Telugu

Realme 9i: స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు బంపర్ ఆఫర్.. కేవలం రూ. 599 కే రియల్ మీ 9ఐ 5జీ ఫోన్?

Realme 9i

Realme 9i

టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ ని వినియోగిస్తున్నారు. ప్రస్తుత రోజుల్లో అయితే ఒకే ఇంట్లో కనీసం రెండు మూడు స్మార్ట్ ఫోన్లు దర్శనమిస్తున్నాయి. అంతేకాకుండా స్మార్ట్ ఫోన్ లోకి ఎడిట్ అయిపోయారు. దీంతో చాలామంది మార్కెట్లోకి అతి తక్కువ ధరలో కానీ ఏదైనా కొత్త రకమైన మొబైల్ ఫోన్లు విడుదల అయ్యాయి అంటే చాలు వెంటనే వాటిని కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే చాలా వరకు కస్టమర్లు తక్కువ ధరతో ఎక్కువ ఫీచర్లు ఉండే మొబైల్స్ ని ఇష్టపడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే స్మార్ట్ ఫోన్ కంపెనీలు కస్టమర్ల కోసం అతి తక్కువ ధరకు ఎన్నో రకాల మొబైల్స్ ని మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకు వస్తున్నాయి.

తాజాగా రియల్ మీ సంస్థ కూడా భారీ తగ్గింపుతో రియల్ మీ 9 ఐ ఫోన్ ని అందిస్తోంది. రియల్ మీ 9ఐ ఫోన్ భారీ తగ్గింపును ఫ్లిప్ కార్ట్ ఆఫర్ ను ప్రకటించింది. అయితే కస్టమర్లకు కేవలం రూ.599 కే రియల్ మీ 9ఐ ఫోన్ ను సొంతం చేసుకోవచ్చు. కానీ కొన్ని నిబంధనలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఈ రియల్ మీ 9ఐ ఫోన్ 4 జీబీ ర్యామ్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో లభిస్తుంది. కాగా దీని ధర రూ.15999 కాగా దీనిని ఫ్లిప్ కార్ట్ లో కొంటే 31.25 శాతం తగ్గింపుతో అనగా రూ.5000 వరకు తగ్గింపు ధరకే పొందవచ్చు. ఈ ఆఫర్ తో పాటుగా ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా వినియోగించుకోవచ్చు. అయితే ఎక్స్చేంజ్ ఆఫర్ లో దాదాపుగా రూ.10400 వరకూ తగ్గింపు లభిస్తుంది.

అనగా రియల్ మీ 9ఐ ఫోన్ కేవలం రూ.599 కే సొంతం చేసుకోవచ్చన్నమాట. అలాగే ఎమ్మార్పీ పై 99 శాతం తగ్గింపు లభిస్తుంది. అయితే ఎక్స్చేంజ్ వాల్యూ మాత్రం మనం ఎక్స్చేంజ్ చేసే ఫోన్ ఫై ఆధారపడి ఉంటుంది. ఇకపోతే ఈ రియల్ మీ 9ఐ ఫీచర్ల విషయానికి వస్తే.. ఈ ఫోన్ 6.6 అంగుళాల ఫుల్ హెచ్ డీ డిస్ ప్లే, స్నాప్ డ్రాగ్నన్ 680 ప్రాసెసర్ విత్ 610 జీపీయూ, ఎండ్రాయిడ్ 11 సపోర్టెడ్, రియల్ మీ యూఐ 2.0, 50 ఎంపీ బ్యాక్ కెమెరా తో ట్రిపుల్ కెమెరా సెటప్, 16 ఎంపీ సెల్ఫీ కెమెరాతో లభించనుంది. అలాగే బ్యాటరీ విషయానికొస్తే.. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంను కలిగి ఉండనుంది.

Exit mobile version