Site icon HashtagU Telugu

UPI Transfer Limit: అన్ని లక్షలకు పెంచిన యూపీఐ లిమిట్.. కానీ కానీ జనవరి 10లోపు ఆ పని చేస్తేనే.. లేదంటే?

Mixcollage 09 Jan 2024 05 46 Pm 2555

Mixcollage 09 Jan 2024 05 46 Pm 2555

ఈ రోజుల్లో యూపీఐ ట్రాన్సాక్షన్ ఎలా ఉందో మనందరికీ తెలిసిందే. చిన్నచిన్న టీ కొట్టు నుంచి పెద్ద పెద్ద ఫైవ్ స్టార్ హోటల్ వరకు ప్రతి ఒక్క ప్రదేశంలో కూడా ఈ యూపీఐ ట్రాన్సాక్షన్స్ జరుగుతూనే ఉన్నాయి. రోజులో 10 రూపాయలు నుంచి లక్షల వరకు యూపీఏ ట్రాన్సాక్షన్స్ జరిపే వారు ఉన్నారు. కానీ మొన్నటి వరకు కేవలం రోజుకి 50,000 మాత్రమే యూపీఐ ట్రాన్సాక్షన్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. కానీ జనవరి 1 నుంచి దాన్ని లక్ష రూపాయలకు పెంచిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా ఆర్బీఐ యూపీఐ కు సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకుని వినియోగదారులకు దానిని మరింత దగ్గర చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

అందులో భాగంగానే గత నెలలో యూపీఐ ట్రాన్స్ ఫర్ లిమిట్ ను భారీగా పెంచింది. కొన్ని కేటగిరీలకు చెందిన లావాదేవీల లిమిట్ ను సవరించింది. ముఖ్యంగా హాస్పటల్స్, విద్యా సంబంధమైన సంస్థలకు ప్రస్తుతం ఉన్న యూపీఐ ట్రాన్స్ ఫర్ లిమిట్ ను రూ. 1 లక్ష నుంచి రూ. 5లక్షలకు పెంచింది. ఈ మేరకు గత నెలలోనే ఆర్బీఐ మార్గ దర్శకాలు జారీ చేసింది. కాగా దీనిని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసేందుకు గానూ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కీలక ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకింగ్ రెగ్యులేటరీ నిర్ణయాన్ని అమలు చేసేందుకు తమ సమ్మతిని తెలియజేసేందుకు జనవరిలో 10 వరకు సమయం ఇచ్చింది. ఈ లోపు దానిలోని సభ్యులు అంటే బ్యాంకులు, వివిద చెల్లింపు సర్వీస్ ప్రొవైడర్లు యూపీఐ అప్లికేషన్లు తమ సమ్మతిని నిర్ధారించాలని ఆదేశించింది.

యూపీఐ ట్రాన్స్ ఫర్స్ కు సంబంధించిన లిమిట్ పెంపుదలను జనవరి 10 నుంచి అమలు చేయాలని ఎన్పీసీఐ చూస్తోంది. అందుకు గానూ తన సభ్యులను నిర్ధారించమని కోరింది. వాస్తవానికి ఈ లిమిట్ పెంపు అనేది బహుళ ప్రయోజనాలను అందిస్తుందట. ముఖ్యంగా ఆస్పత్రులు, విద్యాసంస్థల్లో ఎక్కువ మొత్తంలో లావాదేవీలు జరుగుతుంటాయి. ఆయా చోట్ల ఇప్పటి వరకూ రూ. 1లక్ష వరకూ మాత్రమే లావాదేవీ జరుపుకునే అవకాశం ఉండేది. అయితే ఇప్పుడు దీనిని రూ. 5 లక్షలకు పెంచడంతో వీటి వినియోగం ఆస్పత్రులు, విద్యా సంస్థల్లో కూడా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అంతేకాక జనవరి 10 నుంచి ఈ మార్పును అమలు చేయడంలో ఎటువంటి సవాళ్లు రావని వారు చెబుతున్నారు.

వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా మర్పులు, చేర్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. అయితే ఈ లిమిట్ పెంపు అనేది వెరిఫై చేసిన వ్యాపారులకు మాత్రమే అందుబాటులో ఉంటుందని ఎన్పీసీఐ స్పష్టం చేసింది. ఎన్పీసీఐ సభ్యులు అంటే పీఎస్పీలు, బ్యాంకులు, యూపీఐ యాప్స్, వ్యాపారులు, ఇతర చెల్లింపులు ప్రొవైడర్లు అందరూ ఈ మార్పును గమనించాలని, తమ సమ్మతిని నిర్ధారిస్తూనే.. అవసరమైన ఇతర మార్పులను తమ ప్లాట్ ఫారంలలో చేసుకోవాలని సూచించింది. ఈ ప్రక్రియం అంతా 2024 జనవరి 10లోపు చేసుకోవాలని పేర్కొంది.