Odisha Train Crash : సిమ్ కార్డుతో 44 డెడ్ బాడీస్ అడ్రస్ దొరికింది

Odisha Train Crash : పోగొట్టుకున్న ఫోన్లను గుర్తించడానికి ఇటీవల తీసుకొచ్చిన "సంచార్ సాథీ" ఏఐ టూల్ ను రైల్వేశాఖ బాగా వాడుకుంది. ఒడిశా రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 44 గుర్తు తెలియని  డెడ్ బాడీస్ అడ్రెస్ ను  ఆ టెక్నాలజీతోనే గుర్తు పట్టింది. 

  • Written By:
  • Updated On - June 11, 2023 / 09:01 AM IST

Odisha Train Crash : పోగొట్టుకున్న ఫోన్లను గుర్తించడానికి ఇటీవల తీసుకొచ్చిన “సంచార్ సాథీ” ఏఐ టూల్ ను రైల్వేశాఖ బాగా వాడుకుంది. 

ఒడిశా రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 44 గుర్తు తెలియని  డెడ్ బాడీస్ అడ్రస్ ను  ఆ టెక్నాలజీతోనే గుర్తు పట్టింది. 

చనిపోయిన వారి వేలిముద్రలు, ఫోటోలను “సంచార్ సాథీ”లోకి అప్ లోడ్ చేయగానే వారి ఫోన్ నంబర్లతో పాటు ఆధార్ కార్డు వివరాలన్నీ వచ్చాయి. 

ఒడిశాలోని బాలాసోర్‌ జిల్లా బహనాగ రైల్వే స్టేషన్ సమీపంలో ఇటీవల జరిగిన రైలు ప్రమాదంలో దాదాపు 278 మంది చనిపోయారు. అయితే వారిలో దాదాపు 100 మృతదేహాల అడ్రస్ లను గుర్తించలేని పరిస్థితి ఏర్పడింది. వాళ్లకు సంబంధించిన ఆధార్ కార్డు కానీ .. ఫోన్ నంబర్ కానీ దొరకలేదు.. దీంతో వాటిని తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం  “సంచార్ సాథీ” ఏఐ టూల్ ను వాడుకుంది.  చనిపోయిన వారి వేలిముద్రలు, ఫోటోలను  “సంచార్ సాథీ” ఏఐ టూల్ లోకి అప్ లోడ్ చేశారు. అయితే 65 మంది వేలిముద్రలను “సంచార్ సాథీ” అప్రూవ్ చేసింది. 

Also read : ASTR War On Fake Sims : 36 లక్షల ఫేక్ సిమ్స్ బ్లాక్.. ఏమిటీ ASTR ?

చేతి వేళ్ల చర్మం ధ్వంసమైనందున.. చాలామంది ఫింగర్ ప్రింట్స్ ను ఆ సాఫ్ట్ వేర్ యాక్సెప్ట్ కాలేదు. ఎట్టకేలకు 44 డెడ్ బాడీస్ కు సంబంధించిన ఇంటి చిరునామాలు, కుటుంబ సభ్యుల మొబైల్ నంబర్లు, ఆధార్ కార్డులోని పూర్తి వివరాలు వచ్చాయి. “సంచార్ సాథీ” ఏఐ టూల్.. మొబైల్ కనెక్షన్ ఆధారంగా వారి వివరాలను అందించింది. సిమ్ కార్డుతో(Sim Cards-Dead Bodies) లింక్ అయి ఉన్న ఆధార్ కార్డు వివరాలను సమకూర్చింది. వాటి ఆధారంగా మృతుల కుటుంబ సభ్యులను రైల్వే అధికారులు సంప్రదించారు.