Mobile Phones:ఫోన్ అతిగా వాడుతున్నారా…? మీ అందం ఆవిరైనట్లే.!!

మచ్చల్లేని మెరిసే చర్మం మీ సొంతం కావాలా..?

  • Written By:
  • Publish Date - April 24, 2022 / 11:35 AM IST

మచ్చల్లేని మెరిసే చర్మం మీ సొంతం కావాలా..? అయితే మీ ఫోన్ పక్కన పెట్టండి. ఈ రెండింటికి ఏంటీ సంబంధం అనుకుంటున్నారా..?అదేపనిగా ఫోన్ చేతిలో ఉంటే దాని ప్రభావం చర్మం పడుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.

1. నికెల్, కోవాల్ట్ వంటి వాటిని ఫోన్ల తయారీలో వాడుతుంటారు. వీటి నుంచి రిలీజ్ అయ్యే రేడియేషన్ కిరణాలు, చర్మంలోని యాంటీజెన్స్ పై ప్రభావం చూపిస్తాయి. దీంతో చర్మం అలర్జీలకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలా డెర్మటైటిస్ కు కారణం అవుతుంది.
2. ఎక్కువసేపు అదేవిధంగా ఫోన్ స్క్రీన్ చూస్తుంటే కళ్ల పక్కన గీతలు వస్తాయట. చిన్న అక్షరాలు..తక్కువ వెలుతురులో చదవడమూ కూడా దీనికి కారణం అవుతాయి.
3. ఫోన్ చేత్తో పట్టుకుని ఎక్కువసేపు మెడను కింది వంచి చూడటం వల్ల ఆ ప్రదేశంలో ముడతలు వస్తాయి. ఇది వృద్ధాప్య ఛాయలకు చిహ్నం. దీర్ఘకాలంలో అక్కడ కొలాజెన్ తగ్గి చర్మం సాగుతుంది.
4. మొబైల్ నుంచి వచ్చే నీలికాంతి మీ నిద్రకు భంగం కలిగిస్తుంది. కళ్లు ఉబ్బినట్లుగా ఉండటమే దీనికి కారణం. దీర్ఘకాలంలో ఈ సమస్య కళ్ల కింద నల్లటి వలయాలకు దారి తీస్తుంది.
5. ఫోన్ అవసరం లేనప్పుడు దానిని ఎక్కడో ఒక స్థలంలో పెడుతుంటాం. దీంతో దుమ్ము, సూక్ష్మ క్రిములు చేరతాయి. ఫోన్ మాట్లాడేటప్పుడు అవి చర్మంలోకి చేరి అలర్జీలు, యాక్నేకు దారి తీస్తాయి. కాబట్టి కాలక్షేపానికి ఫోన్ పై ఆధారపడకండి. ఎప్పటికప్పుడు స్క్రీన్ శుభ్రం చేయాలి. ఫోన్ మాట్లాడేప్పుడు చర్మానికి కాస్త దూరంగా పెట్టి మాట్లాడుకోవడం మంచిది.