Electric Bike: మేడ్ ఇన్ హైదరాబాద్ ఎలక్ట్రిక్ బైక్.. ధర, ఫీచర్స్ ఇవే?

ప్రస్తుతం ఇండియా మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు ఉన్న డిమాండ్ క్రేజ్ విపరీతంగా పెరిగిపోతోంది. అంతేకాకుండా

  • Written By:
  • Publish Date - January 31, 2023 / 07:30 AM IST

ప్రస్తుతం ఇండియా మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు ఉన్న డిమాండ్ క్రేజ్ విపరీతంగా పెరిగిపోతోంది. అంతేకాకుండా భారతదేశంలో ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల ట్రెండు నడుస్తోందని చెప్పవచ్చు. ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల ఎలక్ట్రిక్ స్కూటర్లు ఎలక్ట్రిక్ బైక్లు విడుదలైన విషయం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా మార్కెట్ లోకి హైదరాబాద్‌కుచెందిన ఎలక్ట్రిక్ టూవీలర్ కంపెనీ ప్యూర్ ఈవీ సరికొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ ను లాంఛ్ చేసింది. ప్యూర్ ఈవీ ఇకోడ్రిఫ్ట్ పేరుతో ఎలక్ట్రిక్ బైక్‌ను మార్కెట్ లోకి లాంఛ్ చేసింది. ఇది ఇండియాలోని హైదరాబాద్‌లో తయారు చేసిన బైక్. హైదరాబాద్‌లోని ప్యూర్ ఈవీ టెక్నికల్, మ్యాన్యుఫ్యాక్చరింగ్ సెంటర్‌లో డిజైన్ చేసి, ఈ బైక్‌ను రూపొందించారు.

ఇకపోతే ఈ బైక్ ధర ఫీచర్ల విషయానికి వస్తే. ప్యూర్ ఈవీ ఇకోడ్రిఫ్ట్ ఎలక్ట్రిక్ బైక్‌ ధర చూస్తే ఢిల్లీలో ఎక్స్ షోరూమ్ ధర రూ.99,999 గా ఉంది. కాగా ఢిల్లీ ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీతో కలిపి ఈ ధరలో లభిస్తోంది. అయితే ఈ బైక్ ధర వేరు వేరు రాష్ట్రాలలో వేరువేరుగా ఉంటుంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సబ్సిడీ, ఆర్‌టీఓ ఫీజులపై ఈ బైక్ ధర ఆధారపడి ఉండనుంది. ఈ ధర రాష్ట్రాన్ని బట్టి రూ.1,14,999 వరకు వెళ్లవచ్చు. ఈ బైక్ స్పెసిఫికేషన్లో విషయానికి వస్తే.. ప్యూర్ ఈవీ ఇకోడ్రిఫ్ట్ ఎలక్ట్రిక్ బైక్‌లో 3.0 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఈ బైక్‌ను ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 85 కిలోమీటర్ల నుంచి గరిష్టంగా 135 కిలోమీటర్ల రేంజ్ లభిస్తుంది. గరిష్టంగా గంటకు 75 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు.

20 నుంచి 80 శాతం వరకు కేవలం మూడు గంటల్లో ఛార్జ్ అవుతుంది. 0 నుంచి 100 శాతం వరకు 6 గంటల్లో ఛార్జ్ అవుతుంది. కిలోమీటర్‌కు కేవలం 25 పైసల ఖర్చుతో ప్రయాణించవచ్చు. అయితే ఇప్పటికే ప్యూర్ ఈవీ ఇకోడ్రిఫ్ట్ ఎలక్ట్రిక్ బైక్ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. మొదటి బ్యాచ్ వాహనాలను వినియోగదారులకు మార్చి మొదటి వారం నుంచి డెలివరీ చేయనున్నట్లు ఇప్పటికే కంపెనీ వెల్లడించింది. కాగా మనకు ఈ ఎలక్ట్రిక్ బైక్ బ్లాక్, గ్రే, బ్లూ, రెడ్ కలర్స్‌లో లభించనుంది. ఈ బైక్ 140 కిలోల వరకు లోడ్ మోయగలదు. ఇందులో 3 డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి. డ్రైవ్ మోడ్‌లో గంటకు 45 కిలోమీటర్లు, క్రాస్ ఓవర్ మోడ్‌లో గంటకు 60 కిలోమీటర్లు, థ్రిల్ మోడ్‌లో గంటకు 75 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని 5 సెకండ్లలో, 0 నుంచి 60 కిలోమీటర్ల వేగాన్ని 10 సెకండ్లలో అందుకోవచ్చు..