Banks Helpline: ప్రభుత్వ రంగ బ్యాంకులన్నింటికీ ఒకటే హెల్ప్ లైన్.. ఎప్పటి నుంచో తెలుసా?

సాధారణంగా బ్యాంకు కస్టమర్లకు ఏదైనా సమస్త వస్తే వెంటనే ఆయా బ్యాంకులకు కాల్ చేసి వారి సమస్య గురించి

  • Written By:
  • Publish Date - October 21, 2022 / 05:45 PM IST

సాధారణంగా బ్యాంకు కస్టమర్లకు ఏదైనా సమస్త వస్తే వెంటనే ఆయా బ్యాంకులకు కాల్ చేసి వారి సమస్య గురించి పరిష్కారం తెలుసుకుంటూ ఉంటారు. అయితే ఫిర్యాదు చేయడానికి ఇచ్చే నంబర్లే సరిగా పనిచేయడం లేదనేది వినియోగదారులు కొందరు పిర్యాదులు చేస్తున్నారు. అయితే అటువంటి వారి కోసం తాజాగా ఒక హెల్ప్ లైన్ నెంబర్ రాబోతోంది. అదేమిటంటే వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారానికి ప్రభుత్వ రంగ బ్యాంకులన్నింటికీ కలిపి ఒకే హెల్ప్‌ లైన్‌ త్వరలో అందుబాటులోకి రాబోతోంది.

జాతీయ స్థాయిలో ఒకటే హెల్ప్‌లైన్‌ ఉండాలని ఈ మేరకు ప్రభుత్వం ఆయా బ్యాంకులకు సూచించిందని సమాచారం.అయితే మూడు లేదా నాలుగు నంబర్లు కలిగిన హెల్ప్‌లైన్‌ నంబర్‌ను వినియోగదారులకు అందుబాటులో ఉంచాలని సూచించిందట. ఎవరైనా వినియోగదారుడు ఆ నంబర్‌కు కాల్‌ చేయడం ద్వారా సదరు బ్యాంకు లేదంటే సదరు బ్యాంకు శాఖ లేదా సంబంధిత విభాగానికి ఆ కాల్‌ బదిలీ అయ్యేలా ఏర్పాట్లు చేయాలనీ ప్రభుత్వం పేర్కొంది.

అయితే ప్రభుత్వ రంగ బ్యాంకులకు సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నా ఫిర్యాదు చేయడానికి ఇచ్చే నంబర్లే సరిగా పనిచేయడం లేదనేది వినియోగదారుల నుంచి వస్తున్న ప్రధాన ఫిర్యాదులు వస్తుండడంతో ఈ విషయం పై స్పందించిన ప్రభుత్వం వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారంకోసం ఒక నంబర్‌ ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రతిపాదనకు సంబంధించి ఇప్పటికే ప్రాథమిక పనులు కూడా పూర్తయ్యాయని ప్రభుత్వ అధికారి తెలిపినట్లు సమాచారం. అయితే ఒకే నంబర్‌ వల్ల వినియోగదారులకు మేలు చేకూరడంతో పాటు అన్ని బ్యాంకుల ఫిర్యాదుల వ్యవస్థ లో ఒకే విధానం ఉండబోతోంది.