Site icon HashtagU Telugu

PF Balance Check: ఎస్ఎంఎస్ లేదా మిస్డ్ కాల్ తో పీఎఫ్ బ్యాలెన్స్ ను తెలుసుకోండిలా?

Mixcollage 01 Feb 2024 03 19 Pm 9544

Mixcollage 01 Feb 2024 03 19 Pm 9544

పీఎఫ్ ఎక్కౌంట్‌లో ఎంత బ్యాలెన్స్ ఉందనేది ఆన్‌లైన్ ద్వారా తెలుసుకునే వీలు ఉండేది. అయితే కానీ ఇప్పుడు అంతకంటే సులభమైన మార్గం వచ్చేసింది. కేవలం ఒక్క మెస్సేజ్ ద్వారా సులభంగా బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. అలాగే ఇందుకోసం ఇంటర్నెట్ కావాలి అన్న టెన్షన్ కూడా అవసరం లేదు. ఇంటర్నెట్ డేటా అవసరం లేకుండానే కేవలం టెక్స్ట్ మెస్సేజ్‌ తో ఈజీగా మీ పిఎఫ్ బ్యాలెన్స్ ని చెక్ చేసుకోవచ్చు. మరి అందుకోసం ఏం చేయాలి? పిఎఫ్ బ్యాలెన్స్ ను సులభంగా ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ నుంచి EPFOHO అని టైప్ చేసి మీ యూఏఎన్ నెంబర్ నమోదు చేసి 7738299899 నెంబర్‌కు మెస్సేజ్ చేస్తే చాలు వెంటనే మీ బ్యాలెన్స్ ఎంతో ఎస్ఎంఎస్ వచ్చేస్తుంది. అదేవిధంగా ఎస్ఎంఎస్ ద్వారా రాకపోతే మిస్డ్ కాల్ ద్వారా కూడా బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. 9966044425 నెంబర్‌కు మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ నుంచి మిస్డ్ కాల్ ఇస్తే చాలు మీ బ్యాలెన్స్ ఎంత ఉందో క్షణాల్లో తెలిసిపోతుంది. మీ పీఎఫ్ బ్యాలెన్స్‌పై ప్రభుత్వం ఎప్పటికప్పుడు డిపాజిట్ చేసే వడ్డీ డబ్బులతో పీఎఫ్ బ్యాలెన్స్ పెరుగుతుంటుంది.

అయితే ఇంతకుముందు పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవాలంటే ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్ ఓపెన్ చేసి వివరాలు ఎంటర్ చేసి తెలుసుకోవల్సి వచ్చేది. అలా చేయడం వల్ల సమయం ఎక్కువ పట్టడమే కాకుండా ఇంటర్నెట్ డేటా అవసరమయ్యేది. కానీ ఇప్పుడు ఆ అవసరం లేకుండా ఎస్ఎంఎస్ లేదా మిస్డ్ కాల్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. అందుకోసం పైన చెప్పిన విధంగా చేస్తే చాలు.