Site icon HashtagU Telugu

Prompt Engineers : ‘ప్రాంప్ట్’ ఇంజినీర్లకు డిమాండ్.. భారీగా శాలరీ ప్యాకేజీలు

Prompt Engineers Wanted

Prompt Engineers : ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ)  యుగం ఇది. దానికి సంబంధించిన కోర్సులు చేసే వారికి ప్రస్తుతం భారీ డిమాండ్ ఉంది. ఏఐ ఆధారిత యాప్స్, సాఫ్ట్‌వేర్స్, ఛాట్ బాట్స్ తయారీకి ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ప్రముఖ ఐటీ కంపెనీలు  ఏఐ నిపుణుల రిక్రూట్‌మెంట్‌ను చేపడుతున్నాయి.  ప్రత్యేకించి ప్రాంప్ట్‌ ఇంజినీర్(Prompt Engineers) జాబ్స్‌ను భర్తీ చేస్తున్నాయి. ఇంతకీ ఏమిటీ ఉద్యోగం ? దీనికి అప్లై చేసేందుకు అర్హతలు ఏమిటి ? వివరాలివీ..

We’re now on WhatsApp. Click to Join

ఎవరు అర్హులు ?

ప్రస్తుతం ప్రాంప్ట్‌ ఇంజినీర్లకు మంచి డిమాండ్ ఉంది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, ఆంగ్ల భాషపై పట్టు ఉన్నవారు ఈ జాబ్స్‌కు అర్హులు. ప్రాంప్ట్ ఇంజినీర్లకు తొలుత ఏడాదికి రూ. 4 లక్షల దాకా వార్షిక వేతనం లభిస్తుంది. ప్రాంప్ట్ ఇంజినీర్ జీతం సగటున ఏడాదికి రూ.8 లక్షల నుంచి రూ. 13 లక్షల దాకా ఉంటుంది. ఏఐ సర్టిఫికేషన్ (AI Language), మెషీన్ లెర్నింగ్ సర్టిఫికేషన్ కలిగిన ఇంజినీర్లకు దాదాపు రూ. 20 లక్షల దాకా వార్షిక వేతనం ఉంటుంది.

Also Read :Couching Centers:హైదరాబాద్ కోచింగ్ సెంటర్లపై సీఎం రేవంత్ దృష్టి

ప్రాంప్ట్ ఇంజినీర్స్ ఏం చేస్తారు ?

ప్రాంప్ట్‌ ఇంజినీర్లు ఏఐ నుంచి అత్యంత కచ్చితమైన, అవసరమైన సమాచారం తెలుసుకునేందుకు అడగాల్సిన ప్రశ్నలు ఏమిటో గుర్తించాల్సి ఉంటుంది. హ్యూమన్ ఇంటెంట్, ఏఐ మోడల్ ఆర్కిటెక్చర్, ట్రైనింగ్ డేటా, టోకనైజేషన్ మోడల్​పై వీరికి అవగాహన ఉండాలి. నేచురల్‌ లాంగ్వేజ్‌ ప్రాసెసింగ్‌ (ఎన్‌ఎల్‌పీ) టెక్నాలజీలోనూ స్కిల్ అవసరం. ఛాట్ జీపీటీ, గూగుల్ జెమిని, డాల్-ఈ వంటి ఏఐ మోడల్స్​ గురించి తెలిసి ఉండాలి.  అనలిటిక్స్‌ సమాచారాన్ని ప్రాంప్ట్‌ ఇంజినీర్లు అర్థం చేసుకోవాలి. ఏఐ ప్లాట్‌ ఫామ్స్‌ ప్రవర్తన, ప్రదర్శనను అంచనా వేసేందుకు ఇన్‌ పుట్స్‌,  ఔట్‌ పుట్స్‌ను పర్యవేక్షిస్తుండాలి. పైథాన్ వంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలిసి ఉండాలి.

Also Read :Delhi Coaching Centre Tragedy: శ్రేయ కుటుంబంలో కన్నీళ్లు మిగిల్చిన కోచింగ్ సెంటర్