Control with Face : ఇక ముఖ కవళికలతో ఫోన్‌ కంట్రోల్.. ‘ప్రాజెక్ట్ గేమ్ ఫేస్’ ఫీచర్ రెడీ

ఇప్పటిదాకా స్మార్ట్ ఫోన్లలో మనం టచ్ స్క్రీన్ విప్లవాన్ని చూశాం.

Published By: HashtagU Telugu Desk
Control With Face

Control With Face

Control with Face : ఇప్పటిదాకా స్మార్ట్ ఫోన్లలో మనం టచ్ స్క్రీన్ విప్లవాన్ని చూశాం. త్వరలోనే ముఖ కవళికలతోనే ఆండ్రాయిడ్ ఫోన్ల స్కీన్‌ను, మొబైల్ యాప్స్‌ను మనం కంట్రోల్ చేయొచ్చు. ముఖం ద్వారా మనం చేసే సైగలతో కర్సర్‌ను కంట్రోల్ చేస్తూ స్మార్ట్ డివైజ్‌లలో యాక్టివిటీని చక్కబెట్టొచ్చు. దీనికి సంబంధించిన అప్‌డేట్ ప్రస్తుతం జరుగుతున్న గూగుల్ ఆండ్రాయిడ్ కాన్ఫరెన్స్ నుంచి బయటికి వచ్చింది. ముఖ కవళికలతో స్మార్ట్ ఫోన్‌ను కంట్రోల్ చేయగల ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ టెక్నాలజీ గురించి ఆ సదస్సులో ప్రజెంటేషన్ ఇచ్చారు. దీంతో ఏఐ టెక్నాలజీలో మరో కొత్త విప్లవాన్ని క్రియేట్ చేసే దిశగా గూగుల్ ముందడుగు వేసిందని చెప్పొచ్చు.

We’re now on WhatsApp. Click to Join

  • ముఖ కవళికలతో(Control with Face) స్మార్ట్ ఫోన్లను కంట్రోల్ చేసేందుకు దోహదం చేసే ఫీచర్‌కు ‘ప్రాజెక్ట్ గేమ్ ఫేస్’ అనే పేరు పెట్టారు.
  • మరికొద్ది రోజుల్లో ‘ప్రాజెక్ట్ గేమ్ ఫేస్’  ఫీచర్ ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి వస్తుందని గూగుల్ అనౌన్స్ చేసింది.
  • ఈ ఫీచర్ ద్వారా ముఖ కవళికలు, తల, పెదాలు, కళ్లతో సైగలు  చేస్తూ మొత్తం డివైజ్ ఆపరేట్ చేయొచ్చు. గేమ్స్ ఆడొచ్చు. యాప్స్‌లో వివిధ రకాల యాక్టివిటీ చేయొచ్చు. కమాండ్స్ ఇవ్వొచ్చు.
  • ఇంతకీ ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందని అనుకుంటున్నారా ? మరేం లేదు..  ఈ ఏఐ టెక్నాలజీ ఫోన్‌లోని కెమెరా ద్వారా యూజర్  ముఖ, తల కదలికలను ట్రాక్ చేస్తుంది. ఆ కదలికలను కమాండ్స్‌లోకి మార్చి స్మార్ట్ ఫోనులో యాక్టివిటీ జరిగేలా చేస్తుంది.

Also Read :Apple Vision Pro : యాపిల్ విజన్ ప్రో.. ఏమిటిది ? ధర ఎంత ? లాంచ్ ఎప్పుడు ?

  • గేమ్ ఫేస్ ఫీచర్​ను ఉద్యోగ రంగం, ఇతర మొబైల్ ఆపరేషన్స్​లోనూ పరీక్షించే దిశగా గూగుల్ అడుగులు వేస్తోంది. ఇందుకోసం ఇన్ క్లూజ్జా అనే సంస్థతో గూగుల్ భాగస్వామ్య ఒప్పందం కుదర్చుకుంది.
  • వాస్తవానికి ప్రాజెక్ట్ గేమ్‌ ఫేస్ అనేది తొలిసారిగా 2023లో ఓపెన్ సోర్స్, హ్యాండ్స్-ఫ్రీ గేమింగ్ మౌస్‌‌గా అందుబాటులోకి వచ్చింది. కంప్యూటర్​లో తల, ముఖ కవళికలతో అప్పట్లోనే అది సక్సెస్ ఫుల్‌గా ఆపరేట్ అయ్యింది.
  • త్వరలో ఆండ్రాయిడ్ వెర్షన్​లోనూ మన ముందుకు ఆ ఫీచర్ రాబోతోంది.

Also Read :Who is Shooter : స్లొవేకియా ప్రధానిపై కాల్పులు.. 71 ఏళ్ల ముసలాయనే షూటర్

  Last Updated: 16 May 2024, 10:00 AM IST