Profile Song : చాలామంది నిత్యం ఇన్‌స్టాగ్రామ్ చూస్తుంటారు. తీరిక దొరికనప్పుడల్లా దానిలో టైం గడుపుతుంటారు. ఈ తరుణంలో తమ యూజర్ల కోసం ఇన్‌స్టాగ్రామ్ పేరెంట్ కంపెనీ ‘మెటా’ (ఫేస్ బుక్) మరో సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. అదే ప్రొఫైల్ సాంగ్ ఫీచర్. దీన్ని వాడుకొని ఇన్‌స్టా యూజర్లు తమ ప్రొఫైల్ సెక్షన్‌లో పాటను యాడ్ చేయొచ్చు. ఇంతకుముందు వరకు మనం ప్రొఫైల్ సెక్షన్‌లో ఫొటో, పేరును పెట్టుకునేవాళ్లం. ఇప్పుడు వీటికి అదనంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రొఫైల్ సాంగ్(Profile Song) కూడా యాడ్ అవుతుందన్న మాట.
We’re now on WhatsApp. Click to Join
యూజర్లు తమ మూడ్ ఆధారంగా ప్రొఫైల్ సాంగ్‌ను ఎప్పటికప్పుడు మార్చుకోవచ్చు. ఇన్‌స్టా యూజర్లు ప్రొఫైల్ సాంగ్‌ను అప్‌లోడ్ చేసిన తర్వాత.. ప్లే అనే బటన్‌పై నొక్కాలి. దీంతో అది యాక్టివేట్ అయిపోతుంది. ఎవరైనా యూజర్ ప్రొఫైల్‌ను చెక్ చేసినప్పుడు ఆ పాట ప్లే అవుతుంది. అయిత ఒకేసారి సాంగ్ ప్లే అవుతుంది. ఆటో ప్లే ఆప్షన్ ఉండదు. తొలి విడతగా కొంతమంది యూజర్లకే ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది. క్రమంగా ఇన్‌స్టా యూజర్లు అందరికీ దీన్ని అందిస్తారు. ఈ ఫీచర్ ఒకవేళ మీ ఇన్‌స్టా యాప్‌లో వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలంటే తొలుత గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి దాన్ని అప్‌డేట్ చేసుకోవాలి.
Also Read :4455 Jobs : మరో నాలుగు రోజులే గడువు.. 4,455 జాబ్స్‌కు అప్లై చేసుకోండి
ఇన్‌స్టాగ్రామ్ యాప్‌ను తెరిచి, ప్రొఫైల్ ట్యాబ్ నుంచి ‘ఎడిట్ ప్రొఫైల్’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఆ వెంటనే ‘‘మీ ప్రొఫైల్‌కు సంగీతాన్ని జోడించండి’’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అనంతరం మీరు అప్‌లోడ్ చేయదల్చిన సాంగ్ కోసం సెర్చ్ చేయండి. దాన్ని మీ ప్రొఫైల్‌కు జోడించాలని డిసైడ్ అయ్యాక.. ఆ సాంగ్‌లోని 30సెకన్ల క్లిప్‌ను ఎంపిక చేయండి. అనంతరం దాన్ని ప్రొఫైల్ సాంగ్ సెక్షన్‌లో అప్‌లోడ్ చేయండి. ఈ ఫీచర్ కోసం అమెరికాకు చెందిన ప్రముఖ గాయని సబ్రీనా కార్పెంటర్‌తో ఇన్‌స్టాగ్రామ్ ఒప్పందం కుదుర్చుకుంది. ఆమె అందించిన కొన్ని లైసెన్స్‌డ్ సాంగ్స్‌ను అందుబాటులో ఉంచింది. ఇన్‌స్టాగ్రామ్ స్టేటస్‌లో ఏదైనా మెసేజ్ లేదా సాంగ్ పెడితే 24 గంటల్లో మాయం అవుతుంది. కానీ ఇన్‌స్టా ప్రొఫైల్ సాంగ్ అనేది యూజర్లు మార్చే వరకు అదే కంటిన్యూ అవుతుంది.