X Calling Feature : ఆడియో, వీడియో కాల్స్ యాక్టివేషన్ ఇలా.. డేటింగ్, బ్యాంకింగ్ ఫీచర్స్‌ సైతం!

X Calling Feature : ఎక్స్ (ట్విటర్‌)ను వాట్సాప్‌లా డెవలప్ చేసే దిశగా అడుగులు పడుతున్నాయి.

Published By: HashtagU Telugu Desk
X Calling Feature

X Calling Feature

X Calling Feature : ఎక్స్ (ట్విటర్‌)ను వాట్సాప్‌లా డెవలప్ చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. అచ్చం వాట్సాప్ తరహా ఫీచర్లను ఎక్స్‌లో జోడించడంపై దాని యజమాని ఎలాన్ మస్క్ ఫోకస్ చేస్తున్నారు. ఈక్రమంలోనే ఇటీవల ఆడియో, వీడియో కాల్స్‌ ఫీచర్లను ఎక్స్‌లో తీసుకొచ్చారు. ఈ విషయాన్ని స్వయంగా ఎలాన్​ మస్క్‌ తన ఎక్స్‌ ఖాతా వేదికగా ప్రకటించారు. ఈ ఫీచర్ల యాక్టివేషన్‌కు సంబంధించిన స్క్రీన్‌ షాట్స్‌ను కూడా ఆయన షేర్​ చేశారు. అయితే ప్రస్తుతం కొంతమంది ఎక్స్ ‌యూజర్లకే ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఈ సరికొత్త ఫీచర్‌‌ ద్వారా ఫోన్‌ నంబర్‌ లేకుండానే ఎక్స్‌ ద్వారా మనం ఆడియో, వీడియో కాల్స్‌‌‌ను  చేయొచ్చు. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌, మ్యాక్‌, పీసీ అన్నింటికీ ఈ ఫీచర్ సపోర్ట్‌ చేస్తుంది. దీన్ని యాక్టివేట్‌ చేసుకునేందుకు ముందుగా మనం ఎక్స్(ట్విట్టర్)లో సెట్టింగ్స్ సెక్షన్‌లోకి వెళ్లాలి. అందులో ప్రైవసీ అండ్ సేఫ్టీ సెక్షన్‌లోకి వెళ్లాలి. దానిపై క్లిక్ చేస్తే డైరెక్ట్ మెసేజెస్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. దానిపై క్లిక్ చేస్తే.. ఎనేబుల్ ఆ డియో అండ్ వీడియో కాలింగ్ ఫీచర్ కనిపిస్తుంది. దాన్ని ఎనేబుల్ చేసుకుంటే.. ఇక ఎంచక్కా ఎక్స్ ద్వారా ఆడియో, వీడియో కాల్స్‌ను ఎంజాయ్ చేయొచ్చు. ఎవరికీ ఫోన్‌ నంబరు ఇవ్వకుండానే కాల్స్‌ చేసుకునే అవకాశం ఉందని ట్విట్టర్ ప్రకటించింది. ఎక్స్‌‌ను ‘ఎవ్రీథింగ్ యాప్’గా మార్చటంలో భాగంగానే వాయిస్, వీడియో కాల్స్‌ ఫీచర్లను తీసుకొచ్చామని మస్క్(X Calling Feature) అన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఎక్స్ (ట్విట్టర్) యాప్‌‌లో డేటింగ్ ఫీచర్‌ కూడా జోడించాలని ఎలాన్ మస్క్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. 2024 సంవత్సరం చివరికల్లా  డేటింగ్ ఫీచర్‌ని తీసుకొస్తారని సమాచారం. డిజిటల్ బ్యాంకింగ్ ఫీచర్‌ను కూడా తేవాలని మస్క్ అనుకుంటున్నారట. మరోవైపు ట్విట్టర్‌ బ్రాండ్ తొలగింపు ద్వారా దీని విలువ 20 బిలియన్ డాలర్ల మేర క్షీణించిందని ఫోర్బ్స్ రిపోర్ట్ అంచనా వేసింది. డబ్బు చెల్లించి వాడుకోగలిగే కస్టమర్లను మాత్రమే కలిగి ఉందన్న కారణాన్ని ప్రస్తావించింది. యూజర్లు ఏం కోరుకుంటున్నారో ఆ విషయం అధినేత మస్క్‌కి అర్థంకావడంలేదని కంపెనీకి చెందిన ఒకరు వాపోయారని తాజా న్యూస్ రిపోర్టులు పేర్కొంటున్నాయి.

Also Read: History Will Judge : చరిత్రే తీర్పు చెబుతుంది.. ఇజ్రాయెల్-గాజా యుద్ధంపై ఐరాస చీఫ్ వ్యాఖ్య

  Last Updated: 28 Oct 2023, 03:35 PM IST