Prevail Electric Scooter: తక్కువ ధరకే ఈవీ ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర, ఫీచర్స్ ఇవే?

ప్రస్తుతం దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు ఉన్న క్రేజ్ డిమాండ్ విపరీతంగా

  • Written By:
  • Publish Date - April 10, 2023 / 07:00 PM IST

ప్రస్తుతం దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు ఉన్న క్రేజ్ డిమాండ్ విపరీతంగా పెరిగిపోతోంది. దాంతో మార్కెట్లోకి ఎక్కువగా ఇంధనంతో నడిచే వాహనాల కంటే ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కువగా విడుదల అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎలక్ట్రానిక్ సంస్థలు ఒకదాన్ని మించి మరొకటి కొత్త కొత్త ఫీచర్స్ సరికొత్త లుక్ లో అద్భుతమైన ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా మార్కెట్లోకి అతి తక్కువ ధరకే మరో ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల అయ్యింది. ఆ వివరాల్లోకి వెళితే..

ప్రివైల్‌ ఎలక్ట్రిక్ అనే కంపెనీ నుంచి అదిరిపోయే స్టైలిష్ లుక్స్ లో మూడు ఈవీ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. వీటి ఫీచర్స్, బ్యాటరీ కెపాసిటీ, డ్రైవ్ రేంజ్ ని బట్టి వీటి ధరలు ఉంటాయి. లుక్స్ పరంగా మాత్రం అన్నీ యునీక్ గా అనిపిస్తాయి. దీనిలో ప్రివైల్ ఎలక్ట్రిక్ ఎలైట్, ఫైనెస్‌, వోల్ఫురీ అనే మోడల్స్ ఉన్నాయి. ఈ కంపెనీ ఇస్తున్న అద్భుతమైన ఆఫర్ ఏమిటంటే వాహనాలను కొనుగోలు చేయడంతో పాటు విక్రయించవచ్చు. రూ.65 వేల వరకు మీ పాత వాహనానికి ధర లభిస్తుంది. పెట్రోల్ వాహనాలకు లభించే బైబ్యాక్ గ్యారెంటీ కంటే ఇది కాస్త ఎక్కువ మొత్తం చెప్పవచ్చు.

ఇకపోతే ఈ ప్రివైల్ ఎలక్ట్రిక్ కంపెనీ వాహనాల ఫీచర్స్ విషయానికి వస్తే.. గరిష్టంగా 1000 వాట్స్ పవర్ ఫుల్ మోటర్ తో వస్తున్నాయి. గరిష్టంగా 220 కిలోమీటర్ల రేంజ్ తో వస్తున్నాయి. మూడేళ్ల వారెంటీ లభిస్తుంది. 200 కిలోల వరకు బరువును మోయగలదు. ఇందులో స్వాపబుల్ బ్యాటరీస్ ఉన్నాయి. 0 నుంచి 100 శాతం ఫుల్ అవ్వడానికి 8 గంటల వరకు సమయం పడుతుంది. 80 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించ గలదు. మొబైల్ ఛార్జింగ్ పోర్ట్, ఎల్సీడీ స్క్రీన్ ఉంది. ఈ స్క్రీన్ ద్వారా నేవిగేషన్, మ్యూజిక్ కంట్రోల్, కాల్ యాక్సెప్ట్, రిజెక్ట్ చేయవచ్చు. డిస్క్ బ్రేక్స్, చైల్డ్ లాక్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో రివర్స్ గేర్ కూడా ఉంది. కాగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరల విషయానికొస్తే.. ఎలైట్ ధర రూ.1,29,000 గా ఉంది. అలాగే ఫైనెస్ ధర రూ.99,999 గా ఉంది. ఉల్ఫరీ ధర రూ.89,999గా ఉంది.