Imessage Feature: ఐఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఇకపై మెసేజ్లను సీక్రెట్ గా పంపవచ్చు.. ఎలా అంటే?

సాధారణంగా స్మార్ట్ ఫోన్ వినియోగదారులు వారి వ్యక్తిగత విషయాలను పర్సనల్ విషయాలను ఇతరులతో

  • Written By:
  • Publish Date - January 13, 2023 / 07:30 AM IST

సాధారణంగా స్మార్ట్ ఫోన్ వినియోగదారులు వారి వ్యక్తిగత విషయాలను పర్సనల్ విషయాలను ఇతరులతో పంచుకోవడానికి కానీ ఇతరులు చూడడానికి కానీ ఇష్టపడరు. అటువంటి విషయాలలో ప్రైవసీని ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు. అయితే వినియోగదారుల ప్రైవసీకి యాపిల్ పెట్టింది పేరు అని చెప్పవచ్చు. యాపిల్ లో సమాచారం చాలా గోపి గా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. చాలామంది యాపిల్ ఫోన్లను కొనుగోలు చేయడానికి ఇది కూడా ఒక ముఖ్య కారణంగా చెప్పవచ్చు. ఇది ఇలా ఉంటే తాజాగా ఐఫోన్ యూజర్స్ కోసం ఈ యాపిల్ ఒక సూపర్ ఫీచర్ ను తీసుకువచ్చింది.

కాగా తాజాగా ఈ కంపెనీ ఐఫోన్‌లోని ఐమెసేజ్ యాప్‌లో కొత్త ఫీచర్‌ను ఎనేబుల్ చేసింది. ఇన్‌విజిబుల్ మెసేజెస్ ఫీచర్‌ను ఐమెసేజ్ యాప్‌లో ప్రవేశపెట్టింది. దీని సహాయంతో యూజర్స్ పంపించే మెసేజ్‌లు ఇతరులకు నేరుగా కనిపించవు. ఇన్‌విజిబుల్ మెసేజ్ ఫీచర్‌ ఎనేబుల్ చేసిన యూజర్లు ఇతరులకు టెక్స్ట్ పంపిస్తే అవతలి వారు దాన్ని నేరుగా చూడలేరు. బ్లర్‌గా కనిపిస్తుంటుంది. స్వైప్ చేసి చూస్తే గానీ ఆ మెసేజ్ ఏంటో తెలియదు. అయితే అదే ఇన్‌విజిబుల్ మెసేజెస్ ఫీచర్ ముఖ్య ఉద్దేశం అని చెప్పవచ్చు. ముందుగా ఐఫోన్‌లోని ఐమెసేజ్ యాప్‌ ఓపెన్ చేయండి. ఇన్‌విజిబుల్ మెసేజ్‌ పంపాలనుకునే వారి చాట్‌ ఓపెన్ చేయండి. లేదా న్యూ చాట్ క్లిక్ చేసి కాంటాక్ట్ సెలక్ట్ చేసుకోండి.

మెసేజ్ టైప్ చేయడం ప్రారంభించగానే చాట్ బాక్సులో మీకు అప్‌వర్డ్ యారో బటన్ పై టచ్ చేసి హోల్డ్ చేయండి. మెసేజ్ ప్రివ్యూ చూడాలని అనుకుంటే సెండ్ చేయడానికి ముందే గ్రే డాట్స్‌పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ ఎఫెక్ట్‌లను ఎంపిక చేసుకున్న అనంతరం మెసేజ్‌ పంపించడానికి సెండ్ బటన్‌పై క్లిక్ చేయండి. అవతలి వ్యక్తులను మరింత మైమరిపించడానికి స్లామ్ అండ్ లౌడ్ వంటి కొన్ని ఎఫెక్టులను ఉపయోగించవచ్చు. లైవ్‌లీ లేసర్స్, బబుల్స్ వంటి ఫుల్‌స్క్రీన్ ఎఫెక్టుల ద్వారా కూడా మెసేజ్‌లను పంపించవచ్చు.