Poco: పోకో నుంచి రెండు సరికొత్త స్మార్ట్‌ఫోన్స్.. ధర ఫీచర్స్ ఇవే?

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజ సంస్థ పోకో భారత మార్కెట్లోకి ఇప్పటికే ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. అలాగే ఎప్

  • Written By:
  • Publish Date - January 12, 2024 / 05:00 PM IST

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజ సంస్థ పోకో భారత మార్కెట్లోకి ఇప్పటికే ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. అలాగే ఎప్పటికప్పుడు వినియోగదారుల కోసం కొత్త కొత్త ఫోన్ లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది. అయితే వినియోగదారులకు అందరికి అందుబాటులో ఉండే విధంగా బడ్జెట్ ధరలో ఉండే స్మార్ట్ ఫోన్లు ఎక్కువగా మార్కెట్లోకి విడుదల చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా మరో రెండు సరికొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి విడుదల చేసింది. పోకో ఎక్స్‌6 , పోకో ఎక్స్‌6 ప్రో పేరుతో వీటిని మార్కెట్ లోకి తీసుకొచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ధర ఫీచర్ల విషయానికి వస్తే..

పోకో ఎక్స్‌6 స్మార్ట్‌ఫోన్‌.. 6.67 అంగుళాల డిస్‌ప్లేతో వస్తోంది. 120Hz స్క్రీన్‌ రిఫ్రెష్‌ రేటు, 1,800 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌తో వస్తోంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 9300 ప్రాసెసర్‌ను అమర్చారు. స్నాప్‌ డ్రాగన్‌ 7ఎస్‌ జెన్‌2 ప్రాసెసర్‌తో వస్తోంది. 5,100mAh బ్యాటరీ, 167W ఫాస్ట్‌ ఛార్జింగ్ సదుపాయం ఉంది. కెమెరాల విషయానికొస్తే.. ఇందులో 50 ఎంపీ ప్రధాన కెమెరా, 8ఎంపీ అల్ట్రా వైడ్‌ కెమెరా, 2 ఎంపీ మాక్రో కెమెరా ఇచ్చారు. సెల్ఫీ కోసం ముందు భాగంలో 16 ఎంపీ కెమెరా అమర్చారు. ఈ ఫోన్‌ మూడు వేరియంట్లలో అందుబాటులో రానుంది. 8జీబీ+256జీబీ వేరియంట్‌ ధర రూ.19,999గా కంపెనీ నిర్ణయించింది. 12జీబీ+256జీబీ వేరియంట్‌ ధర రూ.21,999 కాగా, 12జీబీ+512జీబీ వేరియంట్‌ ధర రూ.22,999గా ఉంది. ఈ ఫోన్ మిర్రర్‌ బ్లాక్‌, స్నోస్ట్రోమ్‌ వైట్‌ వంటి రంగుల్లో లభించనుంది.

పోకో ఎక్స్‌6 స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న డిస్‌ప్లే, కెమెరా ఫీచర్లే పోకో ఎక్స్‌6 ప్రో ప్రోలో ఉన్నాయని కంపెనీ తెలిపింది. ఇందులో మీడియాటెక్‌ డైమెన్సిటీ 8300 అల్ట్రా ప్రాసెసర్‌ ఉపయోగించారు. ఈ ఫోన్‌ రెండు వేరియంట్లలో రానుంది. 8జీబీ+256జీబీ వేరియంట్‌ ధర రూ.24,999 కాగా 12జీబీ+ 512జీబీ వేరియంట్ ధర రూ.26,999గా కంపెనీ పేర్కొంది. ఎల్లో, రేసింగ్ గ్రే, స్పెక్టర్‌ బ్లాక్‌ రంగుల్లో లభిస్తుంది. ఈ రెండు ఫోన్లు బ్లూటూత్‌, ఎన్‌ఎఫ్‌సీ, జీపీఎస్‌, 3.5mm జాక్‌ యూఎస్‌బీ టైప్‌-సి పోర్ట్‌తో రానున్నాయి. ఫ్లిప్‌కార్ట్‌లో జనవరి 16 నుంచి విక్రయాలు ప్రారంభం కానున్నాయని పోకో వెల్లడించింది. ప్రీ ఆర్డర్‌ బుకింగ్‌లు గురువారం రాత్రి నుంచే మొదలవుతాయని, ఈఎంఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌ క్రెడిట్‌,డెబిట్‌ కార్డు ద్వారా కొనుగోలు చేసిన వారు రూ.2వేలు ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌ పొందొచ్చని కంపెనీ వెల్లడించింది.