Site icon HashtagU Telugu

Poco X6 Pro: పోకో కొత్త స్మార్ట్ ఫోన్ పై భారీగా తగ్గింపు.. ధర, ఫీచర్స్ ఇవే?

Mixcollage 12 Feb 2024 03 35 Pm 2796

Mixcollage 12 Feb 2024 03 35 Pm 2796

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజ సంస్థ పోకో భారత మార్కెట్లోకి ఇప్పటికే ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. అలాగే ఎప్పటికప్పుడు వినియోగదారుల కోసం కొత్త కొత్త ఫోన్ లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది. అయితే వినియోగదారులకు అందరికి అందుబాటులో ఉండే విధంగా బడ్జెట్ ధరలో ఉండే స్మార్ట్ ఫోన్లు ఎక్కువగా మార్కెట్లోకి విడుదల చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా పోకో ఫోన్ పై భారీగా బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. మరి ఆ వివరాల్లోకి వెళితే.. చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం పోకో తన స్మార్ట్‌ ఫోన్‌ పోకో ఎక్స్‌6 ప్రోపై భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది.

ఈ స్మార్ట్‌ ఫోన్‌ ప్రారంభ వేరియంట్ ధర లాంచింగ్‌ సమయంలో రూ. 26,999గా ఉంది. అయితే ప్రస్తుతం కంపెనీ ఈ స్మార్ట్ ఫోన్‌పై రూ. 4 వేలు డిస్కౌంట్‌ అందిస్తోంది. దీంతో ఈ స్మార్ట్‌ ఫోన్‌ను రూ. 22,999కే సొంతం చేసుకోవచ్చు. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ ఆఫర్ల విషయానికొస్తే.. ఈ స్మార్ట్‌ ఫోన్‌ను యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ లేదా ఎస్‌బీఐ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌తో కొనుగోలు చేస్తే రూ. 2వేలు ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌ పొందవచ్చు. దీంతో ఈ స్మార్ట్‌ ఫోన్‌ ప్రారంభ వేరియంట్‌ను రూ. 24,999కి పొందవచ్చు. కేవలం ఇవి మాత్రమే కాకుండా ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌ లో కూడా ఈ ఫోన్‌పై డిస్కౌంట్ పొందవచ్చు. మీ పాత ఫోన్‌ను ఇచ్చి డిస్కౌంట్ పెందవచ్చు.

అలాగే ఈ ఫోన్‌ను కొనుగోలు చేసే సమయంలో రూ. 699 వద్ద 12 నెలల స్పాటిఫై ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. కాగా ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే.. ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.67 ఇంచెస్‌తో కూడిన డిస్‌ప్లేను అందించారు. 8జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌తో తీసుకొచ్చారు. ఈ స్మార్ట్‌ ఫోన్‌ డైమెన్సిటీ డీ8300 అల్ట్రా ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.ఇక ఈ స్మార్ట్‌ ఫోన్‌ కెమెరా విషయానికొస్తే ఇందులో 64 మెగాపిక్సెల్స్‌, 8 మెగాపిక్సెల్‌, 2 మెగాపిక్సెల్స్‌తో కూడిన ట్రిపుల్‌ రెయిర్‌ కెమెరా సెటప్‌ను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 16 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు. 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు.

Exit mobile version