Site icon HashtagU Telugu

Poco M6 Plus 5G Launch: మార్కెట్లోకి రాబోతున్న పోకో కొత్త ఫోన్.. విడుదలకు ముందే ఫీచర్స్ లీక్!

Mixcollage 14 Jul 2024 04 54 Pm 4086

Mixcollage 14 Jul 2024 04 54 Pm 4086

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజ సంస్థ పోకో భారత మార్కెట్ లోకి ఇప్పటికే ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. అలాగే ఎప్పటికప్పుడు వినియోగదారుల కోసం కొత్త కొత్త ఫోన్ లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది. అయితే వినియోగదారులకు అందరికి అందుబాటులో ఉండే విధంగా బడ్జెట్ ధరలో ఉండే స్మార్ట్ ఫోన్లు ఎక్కువగా మార్కెట్లోకి విడుదల చేస్తోంది. అలాగే ఇప్పటికే మార్కెట్ లోకి విడుదల చేసిన స్మార్ట్ ఫోన్ లపై భారీగా డిస్కౌంట్ ని అందిస్తోంది. ఇది ఇలా ఉంటే పోకో సంస్థ మార్కెట్లోకి మరోసారి కొత్త స్మార్ట్ ఫోన్ విడుదల చేయబోతోంది.

అయితే ఈ ఫోన్ ఇంకా మార్కెట్లోకి రాకముందే ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన ఫీచర్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మరి ఆ ఫీచర్ల విషయానికొస్తే.. స్మార్ట్‌ఫోన్ దిగ్గజం పోకో నుంచి త్వరలో కొత్త 5జీ ఫోన్ రాబోతోంది. పోకో M6 ప్లస్ 5G పేరుతో బడ్జెట్ ఫోకస్డ్ ఎమ్ సిరీస్‌ ఆవిష్కరించే అవకాశం ఉంది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ గీక్‌బెంచ్‌తో సహా వివిధ బెంచ్‌ మార్క్‌లలో స్మార్ట్‌ ఫోన్ ఇటీవల గుర్తించారు. మరి ఈ ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే.. పోకో ఎమ్6 ప్లస్ 5జీ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.79 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 4 జనరేషన్ 2 ఏఈథ చిప్‌సెట్‌లో రన్ అయ్యే అవకాశం ఉంది.

కెమెరా విషయానికి వస్తే.. 108ఎంపీ ప్రైమరీ సెన్సార్, 2ఎంపీ సెకండరీ షూటర్‌ని పొందవచ్చు. సెల్ఫీలు, వీడియో కాల్‌లు కోసం ఫ్రంట్ సైడ్ 13ఎంపీ షూటర్ కూడా ఉండవచ్చు. 33డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,030mAh బ్యాటరీతో రావచ్చు. అలాగే పోకో ఎమ్6 ప్లస్ డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్ కోసం ఐపీ53 రేటింగ్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్, 3.5ఎమ్ఎమ్ హెడ్‌ఫోన్ జాక్‌ని కలిగి ఉండవచ్చు. ఈ పోకో ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత హైపర్ఓఎస్ రన్ అవుతుంది. స్మార్ట్‌ఫోన్ మోడల్ నంబర్ 24066PC95Iతో రావచ్చు. గీక్‌బెంచ్‌లో 967 పాయింట్ల సింగిల్ కోర్ స్కోర్, 2,281 పాయింట్ల మల్టీ కోర్ స్కోర్‌తో రావచ్చు. ఇక ఈ స్మార్ట్ ఫోన్ ధర విషయానికి వస్తే.. పోకో ఎమ్6 ప్లస్ 5జీ ఫోన్ 6జీబీ ర్యామ్/128జీబీ స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ. 13,999 8జీబీ ర్యామ్/128జీబీ స్టోరేజ్ వేరియంట్‌ కు రూ. 14,999 గా ఉంది. అంతేకాకుండా, రూ. 1,000 బ్యాంక్ ఆఫర్ కూడా ఉండే అవకాశం ఉంది. తద్వారా ఫోన్ ధర మరింత తగ్గే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.