Site icon HashtagU Telugu

Poco C65: అతి తక్కువ ధరకే అద్భుతమైన కెమెరా ఫీచర్స్ తో అదరగొడుతున్న పోకో స్మార్ట్ ఫోన్?

Mixcollage 15 Dec 2023 07 14 Pm 8409

Mixcollage 15 Dec 2023 07 14 Pm 8409

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజ సంస్థ పోకో భారత మార్కెట్లోకి ఇప్పటికే ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. అలాగే ఎప్పటికప్పుడు వినియోగదారుల కోసం కొత్త కొత్త ఫోన్ లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది. అయితే వినియోగదారులకు అందరికి అందుబాటులో ఉండే విధంగా బడ్జెట్ ధరలో ఉండే స్మార్ట్ ఫోన్లు ఎక్కువగా మార్కెట్లోకి విడుదల చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి విడుదల చేసింది. పోకో సీ65 పేరుతో ఈ ఫోన్‌ను లాంచ్‌ చేశారు. మరి ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన ధర ఫీచర్ల విషయానికి వస్తే..

పోకో సీ65 స్మార్ట్‌ ఫోన్‌ మనకు పాస్టెల్‌ బ్లూ, మాట్‌ బ్లాక్‌ లాంటి కలర్స్‌ లో లభించనుంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ డిసెంబర్‌ 18వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌ లో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. 6.74 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ ఎల్‌ఈడీ స్క్రీన్‌ను అందించారు. 90 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌, 180 హెచ్‌జెడ్‌ టచ్‌ సాంప్లింగ్ రేట్‌తో తీసుకొచ్చారు. ఇక ఈ స్మార్ట్‌ ఫోన్‌లో మీడియాటెక్‌ హీలియో జీ85 ప్రాసెసర్‌ను అందించారు. ఈ స్మార్ట్ ఫోన్‌లో 8జీబీ ర్యామ్‌ను అందించారు. ఇకపోతే స్టోరేజ్‌ విషయానికొస్తే.. ఈ ఫోన్‌ను 128 జీబీ, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్స్‌లో తీసుకొచ్చారు. ఇక మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా ఇంటర్నల్ మెమోరీని పెంచుకోవచ్చు. 720×1600 పిక్సెల్ రిజల్యూషన్‌ తో కూడిన హెచ్‌డీ+ డిస్‌ప్లేను ఇచ్చారు. స్క్రీన్‌ ప్రొటెక్షన్‌ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌ను అందించారు. డ్యూయల్ సిమ్‌కు సపోర్ట్ చేసే ఈ స్మార్ట్ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇక కెమెరా విషయానికొస్తే… ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌ రెయిర్‌ కెమెరాను అందించారు.

అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 8 మెగా పిక్సెల్‌ రెయిర్‌ కెమెరాను అందించారు. ఇక బ్యాటరీ విషయానికొస్తే.. ఇందులో 18 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. ఇక కనెక్టివిటీ విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో బ్లూటూత్‌ 5.3, జీపీఎస్‌, 3.5 ఎమ్‌ఎమ్‌ ఆడియా జాక్‌, యూఎస్‌బీ టైప్‌ సి పోర్ట్ వంటి ఫీచర్లను అందించారు. కాగా ఈ స్మార్ట్ ఫోన్ ధర విషయానికొస్తే.. పోకో సీ65 4 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 9,499కాగా, 6 జీబీ స్టోరేజ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 10,999గా ఉంది. పోకో అధికారిక వెబ్‌సైట్‌తో పాటు, ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌ను ఐసీఐసీఐ డెబిట్‌/క్రెడిట్‌ కార్డు ద్వారా కొనుగోలు చేసే వారికి రూ. 1000 డిస్కౌంట్ పొందొచ్చు.