Site icon HashtagU Telugu

Poco C51: రూ.7 వేలకే పోకో స్మార్ట్ ఫోన్.. ధర, ఫీచర్స్ ఇవే?

Poco C51

Poco C51

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం పోకో ఇప్పటికే మార్కెట్ లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్ లను మార్కెట్ లోకి విడుదల చేస్తూనే ఉంది. వినియోగదారుల అభిరుచుల మేరకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తూనే ఉంది. అంతే కాకుండా అతి తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్ లను విడుదల చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా పోకో సంస్థ భారత మార్కెట్ లోకి సరికొత్త స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. పోకో సీ51 స్మార్ట్ ఫోన్ ని విడుదల చేసింది.

ఆ వివరాల్లోకి వెళితే.. 720×1,600 పిక్సెల్‌తో కూడిన 6.52 ఇంచెస్‌ హెచ్‌డీ డిస్‌ప్లేను అందించారు. 120Hz టచ్ శాంప్లింగ్ రేట్, 400 నిట్స్ బ్రైట్‌నెస్‌ ఈ స్క్రీన్‌ సొంతం. ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో ఆక్టా కోర్ MediaTek Helio G36 SoC ప్రాసెసర్‌ను అందించారు. కెమెరా విషయానికొస్తే ఇందులో 8 మెగా పిక్సెల్ రెయిర్‌ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 5 మెగా పిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాను అందించారు. 5,000mAh భారీ బ్యాటరీ సామర్థ్యంను కూడా కలిగి ఉండనుంది. అలాగే 4జీబీ ర్యామ్‌ 64 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌తో ఈ ఫోన్‌ను తీసుకురానున్నారు.

ఈ స్మార్ట్ ఫోన్ మనకు పవర్ బ్లాక్, రాయల్ బ్లూ వంటి రెండు కలర్స్‌లో అందుబాటులోకి రానుంది. కాగా ఈ ఫోన్‌ త్వరలోనే ఫ్లిప్‌ కార్డులో అందుబాటులోకి రానుంది. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ ద్వారా విషయానికి.. ధర రూ. 8,499 కాగా ప్రారంభ ఆఫర్‌లో భాగంగా రూ. 1000 డిస్కౌంట్ లభించనుంది. దీంతో పాటు ఫ్లిప్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ కార్డుపై అదనంగా 5 శాతం క్యాష్‌ బ్యాక్‌ అందించనున్నారు.