Site icon HashtagU Telugu

Poco c51: మార్కెట్లోకి మరో కొత్త పోకో ఫోన్.. తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్స్?

Poco C51

Poco C51

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం పోకో ఇప్పటికే మార్కెట్ లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్ లను మార్కెట్ లోకి విడుదల చేస్తూనే ఉంది. వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తూనే ఉంది. అంతేకాకుండా అతి తక్కువ ధరకే మంచి మంచి ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్ లను విడుదల చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా పోకో సంస్థ భారత మార్కెట్ లోకి సరికొత్త స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది.

ఇటీవలె భారత మార్కెట్లోకి పోకో సి 51 పేరుతో సరికొత్త స్మార్ట్ ఫోన్ ని మార్కెట్లోకి విడుదల చేసింది. ఏప్రిల్ 10వ తేదీ నుంచి ఈ ఫోన్‌ సేల్ ప్రారంభమైంది. అతి తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్స్ ని ఈ స్మార్ట్ ఫోన్ లో అందించారు.. ఆ వివరాల్లోకి వెళితే.. ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.52 ఇంచెస్‌ హెచ్‌డీ డిస్‌ప్లేను అందించారు. మీడియాటెక్ హీలియో జీ36 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 13 గో క్లీన్ యూఐ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. 4జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌కు సపోర్ట్‌ చేసే ఈ ఫోన్‌లో టర్బో ర్యామ్ ఫీచర్‌తో మరో 3జీబీ ర్యామ్ ఉపయోగించుకోవచ్చు. మొత్తం 7జీబీ వరకు ర్యామ్ వాడుకోవచ్చు.

కాగా ఈ స్మార్ట్ ఫోన్ కెమెరా విషయానికొస్తే.. ఇందులో 8 మెగాపిక్సెల్ డ్యూయెల్ కెమెరా సెటప్ ఉండగా, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ విషయానికి వస్తే.. ఇందులో 10 వాట్‌ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీని అందించారు. ఇక ధర విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌ 4జీబీ ర్యామ్ 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.8,499గా ఉంది. స్మార్ట్‌ ఫోన్‌ సేల్ ప్రారంభమైన తొలిరోజు ఏప్రిల్‌ 10వ తేదీన రూ.7,799కే అందించారు. కాగా ఈ స్మార్ట్ ఫోన్ మనకు రాయల్‌ బ్లూ, పవర్ బ్లాక్ కలర్స్‌లో లభిస్తోంది. ఇలా అతి తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్లు కలిగిన ఈ స్మార్ట్ ఫోన్ వినియోగదారుల దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది.