POCO M6 Pro 4G: మార్కెట్ లోకి పోకో సరికొత్త స్మార్ట్ ఫోన్.. తక్కువ ధరకే అదిరి పోయే ఫీచర్స్?

ప్రస్తుతం మార్కెట్ లో బడ్జెట్ ఫోన్ల హవా నడుస్తున్న విషయం తెలిసిందే. తక్కువ బడ్జెట్ తో ఎక్కువ ఫీచర్స్ కలిగిన స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి వ

  • Written By:
  • Publish Date - June 11, 2024 / 06:51 AM IST

ప్రస్తుతం మార్కెట్ లో బడ్జెట్ ఫోన్ల హవా నడుస్తున్న విషయం తెలిసిందే. తక్కువ బడ్జెట్ తో ఎక్కువ ఫీచర్స్ కలిగిన స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి ప్రముఖ మొబైల్ తయారీ సంస్థలు. మరి ముఖ్యంగా రూ. 10 బడ్జెట్ ను టార్గెట్ చేసుకొని ఒక దానిని మించి మరొక కంపెనీ అద్భుతమైన ఫీచర్లను అందిస్తోంది. ఇలా తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్లను అందిస్తూ వినియోగదారులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. అయితే ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు విడుదలైన విషయం తెలిసిందే. అందులో భాగంగానే ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ పోకో తాజాగా ఒక కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది.

పోకో ఎమ్‌6 ప్రో పేరుతో తీసుకొచ్చింది. మరి ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన మరిన్ని వివరాల్లోకి వెళితే.. తాజాగా పోకో ఎమ్‌6 ప్రో 5జీ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌లో మంచి ఫీచర్లను అందించారు. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ ధర విషయానికి వస్తే.. 6 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌‌ వేరియంట్‌ ధర రూ. 10,700 కాగా, 8 జీబీ ర్యామ్‌ వేరియంట్‌ ధర సుమారు రూ. 14,400 గా ఉండ నుంది. ఇక ఇందులో 6.79 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌హెచ్‌డీ+ ఐపీఎస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. అలాగే ఈ స్మార్ట్‌ ఫోన్‌ డిస్‌ప్లే 90Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇందులో 550 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ ను అందించారు. డీసీ డిమ్మింగ్‌ ఫీచర్‌ ను ప్రత్యేకంగా అందించారు.

ఈ ఫోన్‌ మీడియాటెక్‌ హీలియో జీ91 ప్రాసెసర్‌ తో పనిచేస్తుంది. అలాగే ఈ స్మార్ట్ ఫోన్ లో ఇంటర్నల్ స్టోరేజ్‌ ని ఎస్‌డీ కార్డు ద్వారా 256 జీబీ వరకు పెంచుకోవచ్చు. ఈ ఫోన్‌ లో హైబ్రిడ్ స్లిమ్‌ స్లాట్‌ ను అందించారు. ఇకపోతే ఈ ఫోన్ బ్యాటరీ విషయానికొస్తే.. ఇందులో 33 వాట్స్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5030 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. కాగా ఈ స్మార్ట్ ఫోన్ యొక్క కెమెరా విషయానికొస్తే.. ఇందులో 108 మెగాపిక్సెల్స్‌తో కూడి రెయిర్‌ కెమెరాను, 2 మెగాపిక్సెల్స్‌ సెకడంరీ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 13 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను కూడా అందించారు.