Site icon HashtagU Telugu

Poco F5 5G: మార్కెట్ లోకి పోకో సరికొత్త స్మార్ట్ ఫోన్.. ధర, ఫీచర్స్ ఇవే?

Poco F5 5g

Poco F5 5g

చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం పోకో ఇప్పటికే మార్కెట్ లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్ లను మార్కెట్ లోకి విడుదల చేస్తూనేఉంది. వినియోగదారుల అభిరుచుల మేరకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్ లను విడుదల చేస్తూనే ఉంది. అంతే కాకుండా అతి తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్స్ కలిగిన స్మార్ట్ ఫోన్ లను విడుదల చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా పోకో సంస్థ భారత మార్కెట్ లోకి సరికొత్త స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. అదే Poco F5 5G. ఈ స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా అమ్మకానికి వచ్చేసింది.

ఈ ఫోన్ కావాలనుకునే వారు ఆన్లైన్ లో ఈ కామర్స్ సైట్ ఫ్లిప్కార్ట్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు. మరి ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ధర ఫీచర్ల విషయానికి వస్తే.. Poco F5 5G స్మార్ట్‌ఫోన్ మనకు రెండు వెరియంట్ లలో లభిస్తోంది. 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.29,999 గా ఉంది. అలాగే 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజీ ఉండే మోడల్ ధర రూ.33,999 గా ఉంది. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్ మనకు కార్బన్ బ్లాక్, స్నో స్టార్మ్ వైట్, ఎలక్ట్రిక్ బ్లూ అనే మూడు కలర్స్ లో లభిస్తోంది. ఈ రెండు వేరియంట్లను ఇప్పుడు వరుసగా రూ.26,999, రూ.30,999కే ఆర్డర్ చేయొచ్చు.

ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్ సి , ఎస్బిఐ, ఆక్సిస్ క్రెడిట్, డెబిట్ కార్డులపై రూ.3 వేల వరకు తగ్గింపు లభించనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 68.7 బిలియన్ రంగులను అందించే 12 బిట్ డిస్‌ప్లే టెక్నాలజీతో వచ్చింది. ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేటుతో 6.67 అంగుళాల Xinfinity Pro AMOLED డిస్ ప్లేను కలిగి ఉంది. డాల్బీ విజన్, హెచ్‌‌డిఆర్ 10 అడాప్టివ్ హెచ్‌డిఆర్‌లను కూడా సపోర్ట్ చేస్తుంది. గేమింగ్, వీడియో స్ట్రీమింగ్ కోసం ఇదొక గొప్ప అవకాశంగా చెప్పొచ్చు. Poco F5 5G స్మార్ట్‌ఫోన్ Qualcomm Snapdragon 7+ Gen2 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ఈ డివైజ్ వర్చువల్ ర్యామ్ సపోర్ట్ కలిగి ఉంది. దీని ద్వారా ర్యామ్‌ని 19జీబీ వరకు పెంచుకోవచ్చు. ఈ ఫోన్ హీట్ తగ్గించేందుకు 3725mm ఆవిరి ఛాంబర్, 14 లేయర్ల గ్రాఫైట్ షీట్లను జోడించింది. ఈ ఫోన్ MIUI 14 ఆధారంగా 13 అవుట్ ఆఫ్ ది బాక్సుతో పని చేస్తుంది. ఇకపోతే కెమెరా క్లారిటీ విషయానికి వస్తే.. Poco F5 5G స్మార్ట్‌ ఫోన్‌లో 64ఎంపీ ప్రైమరీ కెమెరా, 8ఎంపీ అల్ట్రా-వైడ్ కెమెరా, 2ఎంపీ మ్యాక్రో కెమెరా, 16ఎంపీ సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి. ఈ ఫోనులో 2x లాస్‌లెస్ ఇన్-సెన్సార్ జూమ్ ఫీచర్, ఫిల్మ్ కెమెరా మోడ్‌లు ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇవి పర్ఫెక్టుగా ఉంటాయి. Poco F5 5G స్మార్ట్‌ఫోన్లో 5000mAh సామర్థ్యంతో కూడిన బ్యాటరీ ఉంటుంది. ఈ డివైజ్‌లో 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 45 నిమిషాలలోపే జిరో నుంచి 100 శాతం వరకు ఫుల్ ఛార్జ్ అవుతుంది.