Site icon HashtagU Telugu

Poco C65 : ‘పోకో సీ65’ ఎంట్రీ.. రూ.9వేలకే 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌

Poco C65

Poco C65

Poco C65 : ఎట్టకేలకు ‘పోకో సీ65’ స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీతో వచ్చిన ఈ ఫోన్‌ను కనిష్టంగా రూ.10,700కే కొనొచ్చు. అయితే ఇందులో 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ కెపాసిిటీ ఉంది. అయితే ఎర్లీ బర్డ్ ఆఫర్ కింద దీన్ని  రూ.9,100కే కొనొచ్చు. ఇక ఇందులోనే మరో వేరియంట్‌ రేటు రూ.12,400. రేటుకు తగిన విధంగా ఇందులో 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ కెపాసిటీ ఉంటుంది. ఈ రెండు వేరియంట్ల స్టోరేజ్‌ను కూడా మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. ‘పోకో సీ65’ మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్‌పై పని చేస్తుంది. బ్లాక్, బ్లూ, పర్పుల్ రంగుల్లో ఈ ఫోన్‌ను కొనొచ్చు. ఇందులో 6.74 అంగుళాల ‘హెచ్‌డీ+’ డిస్‌ప్లే ఉంటుంది. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్. యాస్పెక్ట్ రేషియో 20.6:9. కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌తో ఈ ఫోన్‌కు ప్రొటెక్షన్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఎంఐయూఐ 14 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ వర్క్ చేస్తుంది.

We’re now on WhatsApp. Click to Join.

ఈ ఫోన్‌ వెనుక వైపు 2 కెమెరాలను అందించారు. మెయిన్ కెమెరా కెపాసిటీ 50 మెగాపిక్సెల్, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. 18 వాట్ల వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. 4జీ వోల్టే, వైఫై, బ్లూటూత్ 5.1, జీపీఎస్, గ్లోనాస్ కనెక్టివిటీ ఆప్షన్లు  పోకో సీ65 ఫోన్‌లో అందుబాటులో ఉన్నాయి. 3.5 ఎంఎం ఆడియో జాక్, ఎఫ్ఎం రేడియో సపోర్ట్ కూడా ఉంది. సెక్యూరిటీ కోసం ఫోన్ పక్కభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది.  అయితే ఈ ఫోన్ మనదేశంలో లాంచ్ కావడానికి ఇంకా టైం పడుతుందని(Poco C65) అంటున్నారు.