చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం పోకో ఇప్పటికే మార్కెట్ లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్ లను మార్కెట్ లోకి విడుదల చేస్తూనే ఉంది. వినియోగదారుల అభిరుచుల మేరకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్ లను విడుదల చేస్తూనే ఉంది. అంతేకాకుండా అతి తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్స్ కలిగిన స్మార్ట్ ఫోన్ లను విడుదల చేస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా పోకో సంస్థ భారత మార్కెట్ లోకి కొత్త ఫోన్ లాంచ్ చేసింది. పోకో సీ51 పేరుతో లాంచ్ చేసిన ఈ స్మార్ట్ ఫోన్‌లో ఆక్టాకోర్ మీడియాటెక్ హెలియో జీ36 ఎస్వోసీ చిప్‌సెట్ ప్రాసెసర్‌ను అందించారు.
ప్రముఖ ఈ కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ ధర విషయానికొస్తే.. 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 6,499కాగా 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 8,999గా ఉంది. కొన్ని బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే ఇన్‌స్టంట్‌గా పది శాతం డిస్కౌంట్ లభిస్తుంది.
అలాగే ఈ స్మార్ట్ ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్త్యాన్ని కలిగి ఉండనుంది. ఇందులో 6.52 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేను అందించారు. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్ పని చేస్తుంది.
ఇక కెమెరా విషయానికొస్తే పోకో సీ51లో 8 మెగా పిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాతో పాటు, సెల్ఫీలకోసం 5 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను కూడా అందించారు. ఈ స్మార్ట్ ఫోన్‌లో బ్యాక్ ప్యానెల్‌పై ఫింగర్ ప్రింటర్ సెన్సర్‌ను అందించార. అలాగే కనెక్టివిటీ విషయానికొస్తే ఇందులో ఐక్రో యూఎస్‌బీ పోర్ట్, 3.5 ఎంఎం ఆడియో జాక్ కనెక్టివిటీ వంటి ఫీచర్స్ అందించారు.