POCO C50: అద్దిరిపోయే ఫీచర్లతో లాంచ్ అయిన పోకో స్మార్ట్‌ఫోన్.. ధర 8 వేల కంటే తక్కువే.. బుకింగ్స్ ఎప్పుడు మొదలవుతాయంటే..

ప్రముఖ షావోమీ సబ్‌బ్రాండ్ పోకో నుంచి ఇప్పటికీ ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి విడుదలైన విషయం తెలిసిందే.

  • Written By:
  • Publish Date - January 4, 2023 / 07:30 AM IST

ప్రముఖ షావోమీ సబ్‌బ్రాండ్ పోకో నుంచి ఇప్పటికీ ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి విడుదలైన విషయం తెలిసిందే. తాజాగా పోకో నుంచి మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి విడుదల అయింది. తాజాగా పోకో సి50 స్మార్ట్ ఫోన్ విడుదల అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ ని ఫ్లిప్కార్ట్ ద్వారా లాంచ్ చేశారు. సి సిరీస్ లో విడుదలైన ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన అమ్మకాలు ఈ నెల 10 నుంచి మొదలుకానున్నాయి. ఇక తాజాగా విడుదలైన పోకో సి 50 స్మార్ట్ ఫోన్ ధర ఫీచర్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పోకో సి 50 ధర జర విషయానికి వస్తే.. పోకో సి 50 రెండు ర్యామ్ మోడల్‌లలో రాబోతుండగా అందులో 2జీబీ ర్యామ్ మోడల్ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 6,499 కాగా ఉంది.

ఇక 3జీబీ ర్యామ్ మోడల్ 32జీబీ తో కలిపి రూ.7,299 గా ఉంది. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన అమ్మకాలు ఫ్లిప్కార్ట్ లో ఈ నెల 10 నుంచి మొదలుకానున్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ మనకు ఇక కంట్రీ గ్రీన్, రాయల్ బ్లూ ఇలా రెండు వేరియంట్లుగా లభించనుంది. అలాగే ఈ ఫోన్‌కు ఒక సంవత్సరం వారంటీని కూడా అందిస్తున్నారు. పోకో కంపెనీ ఇన్ బాక్స్ యాక్సెసరీస్‌కు 6 నెలల వారంటీని కూడా అందించనున్నారు. ఇకపోతే పోకో సి 50 స్పెసిఫికేషన్‌లు,ఫీచర్ ల విషయానికి వస్తే.. పోకో సి 50 స్మార్ట్‌ఫోన్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్, వాటర్‌డ్రాప్ నాచ్‌తో 6.52-అంగుళాల ఫుల్ స్క్రీన్ డిస్‌ప్లేను కలిగి ఉంది.

అలాగే MediaTek Helio A22 ప్రాసెసర్, IMG పవర్ VR GPUతో పాటు మార్కెట్‌లో లభించునుంది. కాగా ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేయనుంది. పోకో నుంచి వచ్చిన ఈ ఫోన్ 5000 mAh నాన్-రిమూవబుల్ బ్యాటరీతో పాటు 10W ఛార్జింగ్ స్పీడ్‌ను కలిగి ఉంది. ఛార్జింగ్ కోసం USB టైప్ సి పోర్ట్‌తో వస్తుంది ఇక వినియోగదారుల భద్రత కోసం ఫోన్ వెనుక ప్యానెల్‌లో ఫింగర్‌ప్రింట్ స్కానర్ కూడా ఉంది. అలాగే డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌లో 8 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను అందించారు. అంతేకాకుండా దాని వెనుక ఉన్న రెండో కెమెరా డెప్త్ సెన్సార్. వాటి కింద డ్యూయల్ LED ఫ్లాష్ కూడా ఉంది. ఈ ఫోన్ ముందు భాగంలో వాటర్‌డ్రాప్ నాచ్‌లో 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.