Site icon HashtagU Telugu

Flipkart Sale: ఫ్లిప్ కార్ట్ ఆఫర్.. పాత ఫోన్ ఇచ్చి కొత్త మొబైల్.. రూపాయి కూడా కట్టకుండా?

Flipkart Sale

Flipkart Sale

స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు శుభవార్త. మీరు స్మార్ట్ ఫోన్ ని కొనుగోలు చేయాలి అనుకుంటే ఇది మీకోసమే.. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ వినియోగదారులకు ఒక సూపర్ ఆఫర్ ను ప్రకటించింది. పోకో సీ31 స్మార్ట్‌ఫోన్‌పై అద్భుతమైన ఆఫర్ లభిస్తోంది. 3 జీబీ ర్యామ్, 32 జీబీ మెమరీ వేరియంట్‌ను ఎక్స్చేంజ్ ఆఫర్‌లో ఉచితంగానే పొందే అవకాశాన్ని కల్పించింది. ఆ వివరాల్లోకి వెళితే.. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ పోకో స్మార్ట్‌ ఫోన్ అసలు ధర రూ. 10,999గా ఉంది. అయితే దీన్ని ప్రస్తుతం జరుగుతున్న ఎలక్ట్రానిక్స్ సేల్స్ లో భాగంగా రూ. 6,499కు కొనుగోలు చేయవచ్చు.

అంటే మీకు నేరుగానే 40 శాతం తగ్గింపు అందుబాటులో ఉందని చెప్పువచ్చు. ఈ ఫోన్‌పై బ్యాంక్ ఆఫర్ కూడా ఉంది. కోటక్ క్రెడిట్ కార్డు ద్వారా ఈ పోకో స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేస్తే రూ. 650 వరకు తగ్గింపుతో ఈ ఫోన్ కేవలం రూ. 5849కు లభిస్తుంది. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌పై మరో డీల్ కూడా ఉంది. అదే ఎక్స్చేంజ్ ఆఫర్. ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఏకంగా రూ. 5950 వరకు ఎక్స్చేంజ్ ఆఫర్ లభిస్తోంది. అంటే మీరు బ్యాంక్ ఆఫర్, ఎక్స్చేంజ్ ఆఫర్ కలుపుకుంటే ఒక్క రూపాయి కట్టకుండానే కొత్త ఫోన్ ని సొంతం చేసుకోవచ్చు.

అయితే ఇక్కడ ఎక్స్చేంజ్ ఆఫర్ అనేది మీ స్మార్ట్‌ఫోన్ ప్రాతిపదికన మారుతూ ఉంటుంది. కొన్ని ఫోన్లకు ఎక్స్చేంజ్ విలువ తక్కువ ఉండొచ్చు. అప్పుడు చేతి నుంచి డబ్బులు పెట్టుకోవాల్సి వస్తుంది. అందువల్ల ఫోన్ ఎక్స్చేంజ్ చేసే వారు ఈ విషయాన్ని తప్పకుండా గుర్తించుకోవాలి. ఇకపోతే పోకో సీ31 స్మార్ట్ ఫోన్ ఫీచర్ ల విషయానికి వస్తే.. ఇందులో 6.53 ఇంచుల డిస్‌ప్లే, ఫింగర్ ప్రింట్ సెన్సర్, 2+1 స్లిప్ స్లాట్, మీడియాటెక్ జీ35 ప్రాసెసర్, ట్రిపుల్ రియర్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ బ్యాటరీ సామర్థ్యం ను కలిగి ఉండనుంది.

Exit mobile version