Site icon HashtagU Telugu

PhonePe App Store : ‘ఫోన్‌ పే’ యాప్ స్టోర్ వస్తోంది.. యాప్ డెవలపర్లకు గుడ్ న్యూస్

PhonePe Launches NPS Payment

PhonePe Launches NPS Payment

PhonePe App Store : డిజిటల్‌ పేమెంట్‌ యాప్‌ ‘ఫోన్‌పే’ మరో కీలక అడుగు వేయబోతోంది. ముఖ్యమైన ఇంకో విభాగంలోకి అది ఎంట్రీ ఇవ్వబోతోంది. గూగుల్, యాపిల్ లకు పోటీగా.. మొబైల్ యాప్ డెవలపర్స్ కోసం ఇండస్‌ యాప్‌ స్టోర్‌ (Indus Appstore) పేరిట కొత్త ప్లాట్‌ఫామ్‌ను క్రియేట్ చేయబోతోంది. ఈ స్టోర్‌లో తమ యాప్స్‌ను లిస్ట్‌ చేసుకోవాలని ఇప్పటికే డెవలపర్లను ఫోన్ పే కోరింది. 12 స్థానిక భాషల్లో ఫోన్ పే యాప్‌ స్టోర్‌ అతి త్వరలోనే అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఆండ్రాయిడ్ యాప్ డెవలపర్లు ఈ యాప్ స్టోర్‌లో రిజిస్టర్ చేసుకొని.. మేడిన్ ఇండియా యాప్స్‌ను ఇండస్ యాప్ స్టోర్‌లో అప్‌లోడ్ చేయొచ్చు. ఈవిషయాన్ని ఫోన్‌పే ఓ ప్రకటనలో తెలిపింది.  https://indusappstore.com/ వెబ్‌సైట్‌ ద్వారా యాప్స్‌ను అప్‌లోడ్‌ చేయాలని సూచించింది. యూజర్లు ఈ-మెయిల్ అకౌంట్ అవసరం లేకుండానే మొబైల్ నెంబర్ బేస్డ్ గా లాగిన్ కావచ్చని పేర్కొంది.

Also read : DUSU Election Result 2023: ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ABVP ప్రభంజనం

తొలి ఏడాదిలో మొబైల్ యాప్ డెవలపర్ల నుంచి తాము ఎలాంటి ఫీజు తీసుకోమని ఫోన్‌ పే తెలిపింది. మరుసటి ఏడాది నుంచి నామమాత్రంగా ఫీజు వసూలు చేస్తామని వెల్లడించింది. యాప్‌ డెవలపర్ల నుంచి ప్లాట్‌ఫామ్‌ ఫీజుగానీ, ఇన్‌-యాప్‌ పేమెంట్స్‌కు కమీషన్‌ గానీ తీసుకునేది లేదని తేల్చి చెప్పింది. సాధారణంగా ఇన్‌ యాప్‌ పర్చేజీలపై గూగుల్‌, యాపిల్‌ స్టోర్లు 30 శాతం కమీషన్ వసూలు చేస్తున్నాయి. ఇప్పుడు అవే సర్వీసులకు చౌకగా అందించడానికి ఫోన్ పే (PhonePe App Store)  రెడీ కావడం గమనార్హం.