Site icon HashtagU Telugu

Phone Tricks: ఈ సింపుల్ టిప్స్ ని పాటిస్తే చాలు..మీ పాత ఫోన్ కొత్త ఫోన్లో మారడం ఖాయం!

Phone Tricks

Phone Tricks

మీ స్మార్ట్ ఫోన్ పాతగా అయ్యిందని కొత్త ఫోన్ ని కొనుగోలు చేయాలనుకుంటున్నారా. కానీ ఇప్పుడు మేము చెప్పబోయే కొన్ని సూపర్ టిప్స్ తో పాత ఫోన్ కూడా కొత్త ఫోన్ లాగా వేగంగా పనిచేస్తుందట. మీ పాత స్మార్ట్ ఫోన్ స్లోగా పని చేస్తున్నప్పుడు లేదా సరిగ్గా పని చేయనప్పుడు ఈ ట్రిక్స్‌ ద్వారా మీ పాత ఫోన్‌ని కొత్తంత వేగంగా రన్ చేసేలా చేయవచ్చట. ఒకవేళ మీ ఫోన్ ఐదేళ్ల కంటే తక్కువ పాతది అయి ఉండి ఇప్పటికీ పని చేస్తున్నట్లయితే, మీరు దాని వేగాన్ని అప్‌గ్రేడ్ చేసి, దాన్ని సరికొత్తగా మార్చవచ్చట. మరి అందుకోసం ఏం చేయాలి అన్న విషయానికి వస్తే..

మీ ఫోన్ నుండి పనికిరాని యాప్‌లను అన్‌ఇన్‌స్టాల్ చేయాలట. స్మార్ట్‌ఫోన్‌ లలో చాలా యాప్‌ లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో కొన్నింటిని మాత్రమే మనం రెగ్యులర్‌ గా ఉపయోగిస్తుంటాము. అలాంటప్పుడు, మీరు ఉపయోగించని యాప్‌ లను ఫోన్ నుండి అన్‌ఇన్‌స్టాల్ చేయాలట. అలాగే యాపిల్ iOS, గూగుల్ ఆండ్రాయిడ్ సాఫ్ట్‌ వేర్ కోసం తాజా అప్‌డేట్‌ లను డౌన్‌లోడ్ చేయాలట. ఈ అప్‌డేట్‌ లు పాత ఫోన్‌ కి మళ్లీ కొత్త అనుభూతిని ఇస్తాయట. అలాగే ఫోన్‌ ను అప్‌డేట్ చేయడం ద్వారా ఫోన్ వేగంగా పని చేసేలా చేసే అనేక బగ్‌ లను పరిష్కరించవచ్చట. సిస్టమ్, భద్రతా అప్‌డేట్‌ లు మారుతూ ఉంటాయి. యాప్స్‌ ను అప్‌డేట్‌ చేయవచ్చు.

అలాగే ఫోన్ ని రీస్టార్ట్ చేయడం వల్ల మీ ర్యామ్ ఫ్రీ అవుతుంది. యాప్ లను రీసెట్ చేస్తుంది. ర్యామ్ తక్కువగా ఉన్న ఫోన్‌ లకు ఈ పద్ధతి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే మీ ఫోన్‌ కేబుల్ దెబ్బతిన్నట్లయితే ఒరిజినల్‌ కేబుల్‌ను కొనుగోలు చేయడం మంచిది. బ్యాటరీని తరచుగా 100 శాతం కి ఛార్జ్ చేయవద్దు. అలాగే మీ ఫోన్ 15 శాతం కంటే తక్కువగా ఉంటే దాన్ని ఉపయోగించకండి. ఛార్జింగ్‌ చేసేటప్పుడు కేవలం 80 శాతం వరకు మాత్రమే ఛార్జ్‌ చేయడం మంచిదట. అయితే పైన చెప్పిన అన్ని ట్రిక్స్‌ ప్రయత్నించిన తర్వాత కూడా ఫోన్‌ లో తేడా కనిపించకపోతే, చివరి ప్రయత్నం ఫ్యాక్టరీ రీసెట్ చేయాలట. ఇది మీ ఫోన్‌ ని కొత్తగా కనిపించేలా చేస్తుందట. మీ మొత్తం డేటా కూడా తొలగిపోయి కొత్త ఫోన్‌ లా కనిపిస్తుందట. అన్ని ఫోటోలు, వీడియోలు, మెసేజ్‌ లను బ్యాకప్ చేయలని చెబుతున్నారు.