Site icon HashtagU Telugu

Phone Tips: మీ స్మార్ట్ ఫోన్ చార్జింగ్ అవడం లేదా.. అయితే ఈ పొరపాటు చేస్తున్నారేమో చెక్ చేయండి!

Phone Tips

Phone Tips

ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్ల వాడకం ఎలా ఉందో మనందరికీ తెలిసిందే. చిన్న పెద్ద అని వయసుతో తేడా లేకుండా ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్నారు. ఇకపోతే స్మార్ట్ ఫోన్ వినియోగించే వారు ఎక్కువ శాతం మంది ఇబ్బంది పడే సమస్య మొబైల్ ఫోన్ కి ఛార్జింగ్ సరిగ్గా ఎక్కకపోవడం. ఫోన్‌ ఛార్జింగ్‌ ఎక్కకపోతే టెన్షన్‌ పడుతుంటాము. కొన్ని గంటలపాటు పెట్టినా కూడా రెండు మూడు పాయింట్లు మాత్రమే చార్జింగ్ ఎక్కుతూ ఉంటుంది. అలాంటప్పుడు కొన్ని కొన్ని సార్లు మొబైల్ ఫోన్ ఓవర్ హీట్ అయ్యి పేలిపోవడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అటువంటి పరిస్థితిలో ఏమి చేయాలో తోచదు.

ఫోన్ అకస్మాత్తుగా ఛార్జింగ్‌ కాకపోవడం అప్పుడప్పుడు జరుగుతుంటుంది. వెంటనే సర్వీస్‌ సెంటర్‌కు వెళ్లాల్సి ఉంటుంది. అలాంటప్పుడు తప్పకుండా కొన్ని టిప్స్ ని ఫాలో అవ్వాలని చెబుతున్నారు. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మీ స్మార్ట్‌ ఫోన్ కవర్‌ ను తీసివేసి, ఫోన్‌ ను ఛార్జ్ చేయాలి. మీ ఫోన్ కవర్ ఛార్జింగ్ పోర్ట్ చుట్టూ అడ్డంకులను సృష్టించవచ్చు. దీని వలన ఛార్జింగ్ కేబుల్స్ సరిగ్గా కనెక్ట్ కావు. ఒక్కోసారి మన ఫోన్ నీళ్లతో తడిగా ఉంటే ఛార్జింగ్ ఆగిపోతుంది. మీ ఫోన్ ఛార్జింగ్ పోర్ట్‌ లో తేమ ఉంటే చాలా స్మార్ట్‌ ఫోన్‌లు ఛార్జ్ కావు. ముందుగా చెక్ చేసి, తేమను తొలగించిన తర్వాత ఛార్జింగ్ చేయడం మంచిది. ఫోన్ ఛార్జింగ్ కాకపోవడానికి స్మార్ట్‌ఫోన్ వేడెక్కడం కూడా ఒక కారణం అని చెప్పవచ్చు.

కొన్నిసార్లు వేడి కారణంగా బ్యాటరీ ఛార్జ్‌ కాకపోవచ్చు. అటువంటి సందర్భంలో మీ ఫోన్‌ ను చల్లని ప్రదేశంలో ఉంచాలి. అది చల్లబడిన తర్వాత దాన్ని మళ్లీ ఛార్జ్ చేయడం మంచిది. అలాగే మీ స్మార్ట్‌ఫోన్ కేబుల్ దెబ్బతినే అవకాశం కూడా ఉంది. కాబట్టి వేరే ఛార్జర్ లేదా కేబుల్‌ తో ఛార్జ్ చేయడానికి ప్రయత్నించాలి. మీరు మీ ఛార్జర్ లేదా కేబుల్‌ను మార్చవలసి ఉంటుంది. మీరు మీ ప్లగ్ లేదా సాకెట్‌ తో ఎటువంటి సమస్యలు లేవని కూడా తనిఖీ చేయాలి. ప్లగ్ లేదా సాకెట్ సరిగ్గా పని చేయకపోతే, మీ ఫోన్ ఛార్జ్ కాదని గుర్తుంచుకోవాలి. అలాగే కొన్నిసార్లు ఛార్జింగ్ పోర్ట్ దుమ్ము లేదా ధూళితో మూసుకుపోతుంది. అలాంటప్పుడు మీరు ప్లాస్టిక్ టూత్‌పిక్ లేదా కంప్రెస్డ్ ఎయిర్ వంటి మృదువైన వస్తువుతో జాగ్రత్తగా శుభ్రం చేయాలి. ఇది కాకుండా మీరు ఫోన్‌ను రీస్టార్ట్ చేయడం ద్వారా కూడా చెక్ చేయవచ్చు. కొన్ని కొన్ని సార్లు మీ ఫోన్ లో చార్జింగ్ పిన్ పోయినప్పుడు కూడా చార్జింగ్ ఎక్కదు అటువంటప్పుడు పిన్ మార్పించుకోవడం మంచిది. చివరగా, ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఫోన్ ఛార్జ్ కాకపోతే, మీ ఫోన్ బ్రాండ్ సర్వీస్‌ సెంటర్‌కు తీసుకెళ్లడం మంచిది.