Whatsapp: వాట్సాప్ లో సరికొత్త ఫీచర్.. గ్రూప్ లో జాయిన్ అవ్వాలంటే అనుమతి తప్పనిసరి?

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి మనందరికీ తెలిసిందే. దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా నిత్యం

  • Written By:
  • Publish Date - March 15, 2023 / 07:30 AM IST

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి మనందరికీ తెలిసిందే. దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా నిత్యం లక్షలాది మంది వినియోగదారులు చాటింగ్ కోసం వీడియో కాల్స్ కోసం ఉపయోగిస్తూనే ఉంటారు. అంతేకాకుండా రోజురోజుకీ స్మార్ట్ ఫోన్ వినియోగదారుల సంఖ్యతో పాటు వాట్సాప్ వినియోగదారుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. దీంతో వాట్సాప్ సంస్థ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫ్యూచర్లను అందుబాటులోకి తీసుకువస్తూనే ఉంది.

తాజాగా వాట్సాప్ సంస్థ మరో సరికొత్త ఫీచర్ ని కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే.. గ్రూప్ అడ్మిన్‌లుగా ఉన్న వినియోగదారులు కొత్త వ్యక్తులను ఆమోదించడానికి అనుమతిని ఇచ్చే విధంగా ఒక సరికొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఫీచర్ గ్రూప్ అడ్మిన్‌లకు మరింత నియంత్రణను ఇస్తుంది. గ్రూప్ ఇన్‌వైట్ లింక్ ద్వారా గ్రూప్‌లో చేరగలిగే వ్యక్తుల సంఖ్యను పరిమితం చేయాలనుకునే లేదా నియంత్రించే అవకాశం తాజా అప్‌డేట్‌‌తో గ్రూప్ అడ్మిన్లకు లభించనుంది.

సెట్టింగ్స్ నుంచి ప్రారంభించిన తర్వాత వాట్సాప్ వినియోగదారులు గ్రూప్ చాట్‌లో కొత్త పార్టిసిపెంట్‌లు గ్రూప్‌లో చేరడానికి అడ్మిన్ నుంచి అనుమతిని కోరుతున్నట్లు ప్రాంప్ట్ చేసే సందేశాన్ని చూస్తారు. ఈ ఫీచర్ ప్రస్తుతం బీటా వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉండగా, త్వరలో అందరికీ విడుదల కానుంది. అందుబాటులోకి వచ్చిన తర్వాత, వినియోగదారులు గ్రూప్ సెట్టింగ్‌లలో కొత్త గ్రూప్ సెట్టింగ్‌లను కనుగొంటారు, ఇక్కడ కొత్త పార్టిసిపెంట్‌లను ఆమోదించండి అనే ఎంపిక అందుబాటులో ఉంటుంది.