PAN-Aadhaar: మీరు ఇంకా పాన్‌తో ఆధార్ లింక్ చేయలేదా.. అయితే పాన్ పనిచేయదు?

ఈ రోజుల్లో పాన్ కార్డ్, ఆధార్ కార్డు అన్నవి ముఖ్యమైన డాకుమెంట్స్ గా మారిపోయాయి. ప్రభుత్వ, ప్రైవేట్ పథకాలకు సంబంధించి చాలా వాటికీ ఆధార్ లేదా

  • Written By:
  • Publish Date - January 28, 2024 / 08:09 PM IST

ఈ రోజుల్లో పాన్ కార్డ్, ఆధార్ కార్డు అన్నవి ముఖ్యమైన డాకుమెంట్స్ గా మారిపోయాయి. ప్రభుత్వ, ప్రైవేట్ పథకాలకు సంబంధించి చాలా వాటికీ ఆధార్ లేదా పాన్ కార్డు తప్పనిసరి. ఇకపోతే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ పాన్‌ను ఆధార్ నంబర్‌తో లింక్ చేయాలని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి గడువు కూడా ఎప్పుడో ముగిసింది. అయినా కొంత మంది పాన్ తో ఆధార్ లింక్ చేయలేదు. సమాచార హక్కు అభ్యర్థనకు సమాధానమిస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ గడువుకు ముందు ఆధార్ కార్డ్‌లతో అనుసంధానం కానందున మొత్తం 11.5 కోట్ల పాన్ కార్డులు డీయాక్టివేట్ అయ్యాయని నవంబర్ లో తెలిపింది.

ఆదాయపు పన్ను నిబంధన ప్రకారం పాన్ ఆధార్ లింక్ చేయడం తప్పనిసరి. ఆధార్, పాన్ లింక్ చేయడానికి గడువు 30 జూన్ 2023తో ముగిసింది. భారతదేశంలో 70.24 కోట్ల పాన్ కార్డ్ హోల్డర్లలో, 57.25 కోట్ల మంది తమ పాన్ కార్డులను ఆధార్‌తో అనుసంధానించారు. 11.5 కోట్ల మంది డియాక్టివేట్ అయ్యాయి. ఇవి ఆధార్‌తో కనెక్ట్ కాలేదు అని మధ్యప్రదేశ్ కార్యకర్తకు ఆర్టీఐ సమాధానం ఇచ్చింది. అయితే ఇప్పుడు కూడా పాన్ తో ఆధార్ లింక్ చేయవచ్చు. కానీ దానికి రూ.1000 జరిమానా చెల్లించి లింక్ చేసుకోవాలి. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 139AA, జూలై 1, 2017 నాటికి శాశ్వత ఖాతా సంఖ్య కేటాయించిన, ఆధార్ నంబర్‌ను పొందేందుకు అర్హులైన ప్రతి వ్యక్తి నిర్ణీత ఫారమ్‌లో ఆధార్ నంబర్‌ను తెలియజేయాలి.

అయితే చాలా మంది తమ ఆధార్ పాన్ లింక్ అయిందో లేదో తెలుసుకోలేదు. వారు www.incometax.gov.in/iec/foportal/ వెళ్ళాలి. హోమ్‌పేజీలో లింక్ ఆధార్ స్టేటస్’పై క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ పాన్ నంబర్ మరియు ఆధార్ నంబర్‌ను నమోదు చేయాలి. తర్వాత వ్యూ లింక్ ఆధార్ స్టేటస్ పై క్లిక్ చేయాలి. మీ ఆధార్ లింక్ అయిందో లేదో తెలుస్తుంది. లింక్ కాకుంటే రూ.1000 చెల్లించి లింక్ చేసుకోవాలి. పాన్ డియాక్టివ్ అయితే మీరు బ్యాంక్ సంబంధించి అధిక మొత్తంలో లావాదేవీలు జరపలేరు.