ఇటీవల కాలంలో పాన్ కార్డు ఉపయోగం విపరీతంగా పెరిగిపోయింది. ప్రతి చిన్న పనికి తప్పనిసరిగా పాన్ కార్డు ఉండాల్సిందే. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి అన్న ప్రభుత్వ అలాగే ప్రైవేటు కార్యకలాపాలు అన్నింటికీ తప్పనిసరిగా పాన్ కార్డు ఉండాల్సిందే. మరి అలాంటి ముఖ్యమైన డాక్యుమెంట్లు ఎలాంటి పొరపాట్లు లేకుండా చూసుకోవాలి. అలాంటి పాన్ కార్డు గురించి కొన్ని రకాల విషయాలు కూడా గుర్తుంచుకోవాలట. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ప్రస్తుత కాలంలో పాన్ కార్డ్ అనేది ఆర్థికంగా చాలా ముఖ్యమైన పత్రం.
పన్ను చెల్లింపుదారులను గుర్తించే కంప్యూటర్ ఆధారిత వ్యవస్థనే పాన్ కార్డు అంటారు. ఈ విధానంలో, పన్ను చెల్లింపుదారులను గుర్తించడానికి, వారికి శాశ్వత ఖాతా సంఖ్య లేదా పాన్ నంబర్ అని పిలువబడే ఒక ప్రత్యేక నంబర్ జారీ చేస్తారు. ఈ సంఖ్య పది అంకెలుగా ఉంటుంది. ప్రతి పన్ను చెల్లింపుదారుడు వేర్వేరు పాన్ నంబర్ ను కలిగి ఉంటారు. అయితే పాన్ నంబర్ ఎలా ఏర్పడుతుంది..పాన్ కార్డుపై 10 అంకెల సంఖ్యను పాన్ కార్డ్ నంబర్ అంటారు. పాన్ నంబర్ లో మొదటి 5 అక్షరాలు ఉంటాయి. ఇవి ఇంగ్లీష్ కాపిటల్ రూపంలో ఉంటాయి. ఈ 5 అక్షరాలలో, మొదటి 3 అక్షరాలు A నుండి Z శ్రేణిలోని అక్షరాలు ఉంటాయి. ఈ అక్షరాల తర్వాత ఉన్న నాల్గవ అక్షరం పాన్ కార్డ్ హోల్డర్ స్థితిని సూచిస్తుంది.
ఉదాహరణకు, C అంటే కంపెనీ, P అంటే ఇండి విజువల్, H అంటే హిందూ అవిభక్త కుటుంబం, F అంటే సంస్థ, A అంటే అసోసియేషన్ ఆఫ్ పీపుల్ T అంటే ట్రస్ట్ అని అర్థం. పాన్ కార్డు కేవలం వ్యక్తులకు మాత్రమే కాదు. దీన్ని సంస్థలకు కూడా అందిస్తారు. అయితే పాన్ కార్డ్ నంబర్ మార్చవచ్చా? అన్న విషయానికి వస్తే.. పాన్ కార్డ్ నంబర్ అనేది ఒక ప్రత్యేక సంఖ్య. ప్రతి పన్ను చెల్లింపుదారుడు తన కోసం పాన్ నంబర్‌ని కలిగి ఉంటాడు. నిబంధనల ప్రకారం పాన్ కార్డ్ నంబర్‌ను మార్చుకునే అవకాశం లేదు. మీరు కోరుకుంటే, మీరు పాన్ కార్డ్‌లోని పేరు, పుట్టిన తేదీ మొదలైన మీ వ్యక్తిగత సమాచారాన్ని మార్చవచ్చు. పాన్ కార్డ్‌ని మార్చడానికి లేదా సరి చేయడానికి మీరు పాన్ కార్డ్ కరెక్షన్ ఫారమ్‌ను పూరించాలి. ఇది NSDL లేదా ఆదాయపు పన్ను వెబ్‌సైట్ నుండి PDF ఫార్మాట్‌లో సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే పాన్ కార్డులో మన వివరాలు మార్చుకోవచ్చు కానీ, పాన్ కార్డులో మన నెంబర్ మాత్రం మార్చుకోలేము అందుకు అవకాశం లేదు అని చెబుతున్నారు.