Site icon HashtagU Telugu

PAN Card: మీ దగ్గర పాన్ కార్డు లేదా.. అయితే ఈ పనులు నిలిచిపోవడం ఖాయం?

Mixcollage 22 Mar 2024 04 07 Pm 6034

Mixcollage 22 Mar 2024 04 07 Pm 6034

పాన్ కార్డు ప్రస్తుత రోజుల్లో ముఖ్యమైన డాక్యుమెంట్ గా మారిపోయింది. చాలావాటికి పాన్ కార్డును ఆధారంగా అడుగుతున్నారు.ఆర్థిక లావాదేవీలు, ఐటీ రీటన్స్ లాంటి విషయాలు తెలుసుకోవడానికి ఈ కార్డులు తప్పనిసరిగా ఉండాల్సిందే. ఈ డాక్యుమెంట్ల ద్వారా వివిధ పనులు చేసుకోవచ్చు. పాన్ కార్డు ద్వారా దేశంలో ఆర్థిక లావాదేవీలు పూర్తి చేయవచ్చు. అలాగే, ప్రజల పన్ను బాధ్యతను నిర్ణయించడానికి ప్రభుత్వం పాన్ వివరాల ద్వారా వచ్చే సమాచారంపై ఆధారపడుతుంది. ఇలా ఎన్నో ముఖ్యమైన వాటికి ఉపయోగించే ఈ పాన్ కార్డు లేకపోతే ఎన్నో రకాల ఆ పనులు నిలిచిపోతాయట.

మరి పాన్ కార్డు లేకపోతే ఏం జరుగుతుందో ఇలాంటి పనులు నిలిచిపోతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ద్విచక్ర వాహనాలు కాకుండా ఇతర వాహనాల అమ్మకం లేదా కొనుగోలు కోసం, సహకార ఖాతాలో టర్మ్ పొదుపు కోసం, నిర్ణీత కాలానికి బ్యాంకు పొదుపు ఖాతాలకు,క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసినప్పుడు,SEBI నియంత్రిత బ్రోకర్లు, సంస్థలు, ఏజెంట్ల నుండి డీమ్యాట్ ఖాతా తెరవడానికి, హోటల్ లేదా రెస్టారెంట్‌లో రూ. 50,000 కంటే ఎక్కువ మొత్తం బిల్లును చెల్లించడానికి కూడా తప్పనిసరి. అలాగే విదేశీ ప్రయాణం, విదేశీ కరెన్సీ కొనుగోలు కోసం, రూ.50,000 కంటే ఎక్కువ మొత్తం లావాదేవీ ఉంటే మ్యూచువల్ ఫండ్ పథకంలో యూనిట్ కొనుగోలు కోసం, రూ. 50,000 కంటే ఎక్కువ ఖర్చు.

RBI నుండి బాండ్లను కొనుగోలు చేయడానికి రూ. 50,000 లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు చేయడం, కో-ఆపరేటివ్ బ్యాంక్‌తో సహా మరే ఇతర బ్యాంకులోనైనా ఒకే రోజులో 50,000 వేల లావాదేవీలు కోసం ఉపయోగపడుతుంది. బ్యాంక్ డ్రాఫ్ట్ లేదా ఇతర లావాదేవీల కోసం ఒక రోజులో రూ. 50,000 కంటే ఎక్కువ నగదు 50,000 లేదా ఒక ఆర్థిక సంవత్సరంలో ఏదైనా బ్యాంకింగ్ కంపెనీ, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ, కో-ఆపరేటివ్ బ్యాంక్, పోస్టాఫీసులో మొత్తం రూ. 5 లక్షలు ఉన్నప్పుడు, ఆర్థిక సంవత్సరంలో రూ.50,000 కంటే ఎక్కువ జీవిత బీమా ప్రీమియం, షేర్ల కొనుగోలు, అమ్మకం కోసం రూ.1 లక్ష లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు, ఏదైనా స్థిరాస్తి అమ్మకం లేదా కొనుగోలు కోసం 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు.

Exit mobile version