Pan Card: పాన్ కార్డ్ పోయిందా.. అయితే కొత్త డూప్లికేట్ పాన్ కార్డ్ ఎలా తీసుకోవాలో తెలుసా?

పాన్ కార్డు ప్రస్తుత రోజుల్లో ముఖ్యమైన డాక్యుమెంట్ గా మారిపోయింది. చాలావాటికి పాన్ కార్డును ఆధారంగా అడుగుతున్నారు.ఆర్థిక లావాదేవీలు, ఐటీ ర

  • Written By:
  • Publish Date - July 3, 2024 / 12:30 PM IST

పాన్ కార్డు ప్రస్తుత రోజుల్లో ముఖ్యమైన డాక్యుమెంట్ గా మారిపోయింది. చాలావాటికి పాన్ కార్డును ఆధారంగా అడుగుతున్నారు.ఆర్థిక లావాదేవీలు, ఐటీ రీటన్స్ లాంటి విషయాలు తెలుసుకోవడానికి ఈ కార్డు తప్పనిసరిగా ఉండాల్సిందే. ఈ డాక్యుమెంట్ల ద్వారా వివిధ పనులు చేసుకోవచ్చు. పాన్ కార్డు ద్వారా దేశంలో ఆర్థిక లావాదేవీలు పూర్తి చేయవచ్చు. ఆధార్ కార్డు తర్వాత పాన్ కార్డు ని అతి ముఖ్యమైన డాక్యుమెంట్ గా చెప్పవచ్చు. కాగా రోజుల్లో పాన్‌కార్డు ప్రాముఖ్యత మరింతగా పెరగనుంది.

అంత ముఖ్యమైన పాన్‌కార్డు ఒకవేళ పోగొట్టుకున్నా చింతించాల్సిన పనిలేదు. వెంటనే చాలా సులభంగా ఈజీగా డూప్లికేట్ పాన్ కార్డును తీసుకోవచ్చట. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అయితే ఇందుకోసం ముందుగా నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ NSDL లేదా UTI ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ అండ్ సర్వీసెస్ లిమిటెడ్ UTIITSL పోర్టల్ ఓపెన్ చేయాలి. ఇప్పుడు రిక్వస్ట్ ఫర్ న్యూ పాన్‌కార్డ్ లేదా ఛేంజెస్ ఆర్ కరెక్షన్ ఇన్ పాన్‌ డేటా ఫిల్ చేయాలి. ఇందులో మీ పేరు, పుట్టిన తేదీ, తండ్రి పేరు, పాన్ నెంర్ వివరాలు భర్తీ చేయాలి.

ఇప్పుడు ప్రూఫ్ కోసం ఆధార్ కార్డు లేదా ఓటర్ ఐడీ కార్డు అప్‌లోడ్ చేయాలి. ఇవి ఐడీ ప్రూఫ్ , అడ్రస్ ప్రూఫ్ కోసం పనికొస్తాయి. డూప్లికేట్ పాన్‌కార్డు కోసం నామినల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా ఫీజు చెల్లించవచ్చు. అప్లికేషన్ పూర్తిగా నింపి సబ్మిట్ చేశాక మీకొక రిసీప్ట్ వస్తుంది. ఈ రిసీప్ట్ ఆధారంగా మీ అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు పాన్ నెంబర్ కచ్చితంగా అవసరమౌతుంది. మీరు సమర్పించిన వివరాలు వెరిఫై చేసేందుకు పాన్‌కార్డు ఉపయోగపడుతుంది. ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేందుకు పాన్‌కార్డు చాలా అవసరం. మీ ఆర్ధిక కార్యకలాపాలు స్థిరంగా ఉన్నాయో లేవా అనేది పాన్‌కార్డు ధృవీకరిస్తుంది. ఐటీ రిఫండ్ కోసం కూడా పాన్‌కార్డు అవసరం ఉంటుంది. మీరు ఒకవేళ పాన్‌కార్డు పోగొట్టుకుంటే కొత్త పాన్‌కార్డు పొందవచ్చు.