Site icon HashtagU Telugu

PAN Card: పాన్ కార్డ్ హోల్డర్స్ కి అలర్ట్.. ఎక్కువ పాన్ కార్డ్ లు ఉంటే 10 వేల ఫైన్ కట్టాల్సిందే?

Mixcollage 19 Feb 2024 07 26 Pm 825

Mixcollage 19 Feb 2024 07 26 Pm 825

పాన్ కార్డు ప్రస్తుత రోజుల్లో ముఖ్యమైన డాక్యుమెంట్ గా మారిపోయింది. చాలావాటికి పాన్ కార్డును ఆధారంగా అడుగుతున్నారు.ఆర్థిక లావాదేవీలు, ఐటీ రీటన్స్ లాంటి విషయాలు తెలుసుకోవడానికి ఈ కార్డులు తప్పనిసరిగా ఉండాల్సిందే. ఈ డాక్యుమెంట్ల ద్వారా వివిధ పనులు చేసుకోవచ్చు. పాన్ కార్డు ద్వారా దేశంలో ఆర్థిక లావాదేవీలు పూర్తి చేయవచ్చు. అలాగే, ప్రజల పన్ను బాధ్యతను నిర్ణయించడానికి ప్రభుత్వం పాన్ వివరాల ద్వారా వచ్చే సమాచారంపై ఆధారపడుతుంది. అయితే, పాన్ కార్డుకు సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాల పట్ల జాగ్రత్తగా చూసుకోవాలి, లేకపోతే జరిమానా కూడా విధించవచ్చు.

అయితే వాస్తవానికి, దేశంలో ఏ ఒక్కరూ డూప్లికేట్ లేదా ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులను కలిగి ఉండటానికి చట్టం అనుమతించలేదు. అటువంటి పరిస్థితిలో, ఒక వ్యక్తి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పాన్ కార్డులను కలిగి ఉంటే, అతను తీవ్రమైన సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పాన్ కార్డులు ఉన్న ఎవరైనా పెద్ద ఇబ్బందుల్లో పడవచ్చు. వాస్తవానికి చాలా సార్లు డబుల్ అప్లికేషన్ వల్ల పాన్ కార్డును రెండుసార్లు జారీ చేయవచ్చు. ఇలాంటి పరిస్థితిలో ప్రజలు ఈ పరిస్థితిని నివారించాలి. పట్టుబడితే కార్డు హోల్డర్స్ చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

కొంతమందికి ఐటీ శాఖ నుంచి కార్డు రాగా, మరికొందరికి ఔట్ సోర్సింగ్ ద్వారా వచ్చిన ఏజెన్సీల నుంచి కార్డు వచ్చి ఉండవచ్చు. అటువంటి పరిస్థితిలో, ప్రజలు తమ పాన్ కార్డులలో ఒకదాన్ని రద్దు చేయాల్సి ఉంటుంది. కొంతమంది ప్రభుత్వాన్ని మోసం చేయడానికి ఒకటి కంటే ఎక్కువ పాన్ కోసం దరఖాస్తు చేయవచ్చు. వాటిపై జరిమానాలు విధించబడతాయి. ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులను కలిగి ఉండటానికి కఠినమైన నిబంధనలు ఉన్నాయి. డూప్లికేట్ పాన్ కలిగి ఉంటే ప్రభుత్వం రూ .10,000 జరిమానా విధిస్తుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 272బి కింద ఈ జరిమానా విధించారు.