PAN Card: పాన్ కార్డ్ విషయంలో ఈ తప్పులు చేస్తే జరిమానాతో పాటు జైలు శిక్ష?

భారత్ లో నివసిస్తున్న వారికి రాను రాను ఆధార్ కార్డు మాదిరే పాన్ కార్డు కూడా కీలకంగా మారిపోయింది. అంతేకాకుండా

  • Written By:
  • Publish Date - November 23, 2022 / 05:20 PM IST

భారత్ లో నివసిస్తున్న వారికి రాను రాను ఆధార్ కార్డు మాదిరే పాన్ కార్డు కూడా కీలకంగా మారిపోయింది. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో బ్యాంకు ఖాతా తెరవడానికి అలాగే లావాదేవీలు జరపడానికి పాన్ కార్డు తప్పనిసరిగా మారింది. కాగా సాధారణంగా పాన్ కార్డును ఆర్థిక విషయాలను గుర్తించడం కోసం ఉపయోగిస్తారు అన్న విషయం తెలిసిందే. అందుకే ఈ మధ్యకాలంలో బ్యాంకు లావాదేలకు సంబంధించిన విషయాలలో పాన్ కార్డును తప్పని సరి చేస్తున్నారు. అలా ముఖ్యమైన డాక్యుమెంట్లలో పాన్ కార్డు కూడా ఒకటిగా మారిపోయింది. అయితే పాన్ కార్డు విషయంలో కొన్ని సార్లు తెలిసి తెలియక చేసే తప్పుల వల్ల జరిమానా తో పాటు జైలు శిక్షణ కూడా అనుభవించాల్సి ఉంటుందట.

మరి పాన్ కార్డు విషయంలో ఎటువంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కదా ప్రభుత్వ నిబంధన ప్రకారం ఒక వ్యక్తి దగ్గర ఒక పాన్ కార్డు మాత్రమే ఉండాలి అంతకంటే ఎక్కువ పాన్ కార్డులు ఉంటే జరిమానాలతో పాటు కేసును కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే కొందరికి ఒకే అడ్రస్కు వేరే వేరే సమయాలలో పాన్ కార్డులు రావడం లేదా అడ్రస్ మారిన సమయాల్లో పాన్ కార్డు రెండు చోట్లకి రావడం ఇలా జరుగుతూ ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర రెండు పాన్ కార్డులో ఉంటే పెద్ద మొత్తంలో పెనాల్టీని చెల్లించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే 1961 ఇన్కమ్ టాక్స్ యాక్ట్ సెక్షన్ 272B నిబంధన ప్రకారం ఒక వ్యక్తి దగ్గర ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు ఉంటే జరిమానాలతో పాటుగా జైలుకు కూడా వెళ్లాల్సి ఉంటుంది.

ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు ఉంటే ఏం చేయాలి అన్న విషయానికి వస్తే..అప్పుడు మీ వద్ద ఉన్న రెండో పాన్‌కార్డు ను ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ అధికారులకు సరెండర్‌ చేయాలి. ఒక దరఖాస్తు ఫారాన్ని నింపి పాన్‌కార్డును సరెండర్‌ చేయవచ్చు. ఇలా చేసినట్లయితే మీకు ఎలాంటి జరిమానా,శిక్ష పడదు. మరి పాన్ కార్డును ఏ విధంగా సరెండర్ చేయాలి అన్న విషయానికి వస్తే.. ఇందుకోసం ముందుగా మీరు ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ అధికారిక వెబ్సైట్ ను సందర్శించాలి. వెబ్ సైట్ ఓపెన్ చేసిన తర్వాత రిక్వెస్ట్ ఫర్ న్యూ పాన్ కార్డ్ అండ్ చేంజెస్, కరెక్షన్ ఇన్ పాన్ డేటా అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఆపై ఫారమ్‌ డౌన్‌లోడ్‌ చేసి అందులో వివరాలు నమోదు చేయాలి. ఆ తర్వాత ఎన్‌ఎస్‌డీఎల్‌ కార్యాలయానికి వెళ్లి అక్కడ ఫిలప్ చేసిన ఫారాన్ని సబ్మిట్ చేయాలి. అదే కార్యాలయంలో నింపిన ఫారంతో పాటు,మీ దగ్గర ఉన్న రెండో పాన్ కార్డును సమర్పించాలి. ఇలా చేయడం వల్ల జరిమానాలతో పాటు జైలు శిక్ష నుంచి కూడా తప్పించుకోవచ్చు.