Site icon HashtagU Telugu

PAN: పాన్ కార్డులో తండ్రి పేరు లేకుంటే చెల్లుబాటు కాదా.. అధికారులు ఏం చెబుతున్నారంటే?

New Pan Card

New Pan Card

పాన్ కార్డు ప్రస్తుత రోజుల్లో ముఖ్యమైన డాక్యుమెంట్ గా మారిపోయింది. చాలా వాటికి పాన్ కార్డును ఆధారంగా అడుగుతున్నారు. ఆర్థిక లావాదేవీలు, ఐటీ రిటన్స్ లాంటి విషయాలు తెలుసుకోవడానికి ఈ కార్డు తప్పనిసరిగా ఉండాల్సిందే. ఈ డాక్యుమెంట్ల ద్వారా వివిధ పనులు చేసుకోవచ్చు. పాన్ కార్డు ద్వారా దేశంలో ఆర్థిక లావాదేవీలు పూర్తి చేయవచ్చు. ఆధార్ కార్డు తర్వాత పాన్ కార్డు ని అతి ముఖ్యమైన డాక్యుమెంట్ గా చెప్పవచ్చు. కాగా రోజుల్లో పాన్‌కార్డు ప్రాముఖ్యత మరింతగా పెరగనుంది. మామూలుగా పాన్ కార్డులో పాన్ కార్డు నెంబర్ తో పాటు ఆ వ్యక్తి పేరు తండ్రి పేరు అలాగే డేట్ అఫ్ బర్త్ వంటి వివరాలు నమోదు అయ్యి ఉంటాయి.

కొంతమందికి కొన్ని కొన్ని సార్లు కొన్ని మిస్టేక్స్ వల్ల తండ్రి పేరు అందులో పడటం మిస్ అయ్యి ఉంటుంది. అయితే పాన్ కార్డులో తండ్రి పేరు తప్పనిసరిగా ఉండాలా? తండ్రి పేరు లేకపోతే పాన్ కార్డు చెల్లదా అన్న విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. సాధారణంగా మనం పేరు రాసేటప్పుడు తండ్రి పేరులోని మొదటి అక్షరాన్ని ఇనీషియల్‌ గా ఉపయోగిస్తాము. అయితే పాన్ కార్డులో పేరు పక్కన తండ్రి పేరు లేకుండా అది చెల్లదని సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. పాన్ కార్డులో తండ్రి పూర్తి పేరు ఉండాలి. మరోవైపు, కేవలం అక్షరాలు మాత్రమే ఉంటే, పాన్ కార్డ్ చెల్లదు. ఒకరి పేరుకు బదులు కేవలం అక్షరాలు మాత్రమే ఉన్న కార్డులను వెంటనే మార్చుకోవాలని ఒక సందేశం వైరల్‌ అవుతోంది. దీనిపై ఆదాయపన్ను శాఖ వివరణ ఇస్తూ..

పాన్ కార్డుల్లో ఇనీషియల్‌ లు మాత్రమే ఉన్నప్పటికీ, ఇంటర్నెట్‌ లో తండ్రి పేరు కూడా ఉంటుంది. పాన్ కార్డులపై తక్షణమే పేరు మార్చాలన్నది అవాస్తవమని సమాచారం ఇచ్చింది. ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ అధికారిక వెబ్‌సైట్‌లో ఇనీషియల్‌లతో కూడిన పాన్ కార్డ్ చెల్లదని ఎక్కడా పేర్కొనలేదు. కాబట్టి ప్రస్తుతం సోషల్ మీడియాలో తండ్రి పేరు లేకపోతే పాన్ కార్డు చెల్లదు అని వస్తున్న వార్తలు అవాస్తవమని ఆదాయపన్ను శాఖ కొట్టి పడేసింది.