Site icon HashtagU Telugu

Oppo Reno 12: మార్కెట్ లోకి మరో ఓప్పో ఫోన్‌.. ధర, ఫీచర్స్ మాములుగా లేవుగా?

Mixcollage 13 Jul 2024 05 14 Pm 5014

Mixcollage 13 Jul 2024 05 14 Pm 5014

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ దిగ్గజ సంస్థ ఒప్పో ఇప్పటికే మార్కెట్ లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. వాటితో పాటు ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది. అంతే కాకుండా ఇప్పటికే మార్కెట్లోకి విడుదల చేసిన స్మార్ట్ ఫోన్ల లలో వేరియెంట్ లను కూడా విడుదల చేస్తోంది. ఇది ఇలా ఉంటే త్వరలోనే ఒప్పో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసేందుకు సిద్ధమవుతోంది. ఆ వివరాల్లోకి వెళితే.. ఒప్పో రెనో 12 పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. ఈ ఫోన్‌ లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ తో కూడిన కొన్ని ఫీచర్ లను కూడా అందించారు.

ఇకపోతే ఈ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. కాగా ఒప్పో రెనో 12 సిరీస్‌లో భాగంగా రెండు కొత్త ఫోన్‌ లను తీసుకొచ్చింది. ఒప్పో రెన్‌ 12, ఒప్పో రెనో 12 ప్రో పేరుతో 5జీ ఫోన్‌ లను లాంచ్‌ చేశారు. ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే.. ఈ రెండు ఫోన్‌ లలో 6.67 ఇంచెస్‌ తో కూడిన ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ కర్వ్డ్‌ ఫ్లెక్సిబుల్ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. అలాగే రెనో 12 లో స్క్రీన్ ప్రొటెక్షన్‌ కోసం గొరిల్లా గ్లాస్‌ 7ఐని అందించారు. అలాగే రెనో 12 ప్రో ఫోన్‌లో గొరిల్లా గ్లాస్‌ విక్టస్‌ 2 ప్రొటెక్షన్‌ ను కూడా అందించార. ఈ రెండు ఫోన్‌లు 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌ ను కలిగి ఉన్నాయి. అలాగే 1200 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెట్‌ వీటి సొంతం. ఇక ఈ రెండు ఫోన్‌లు కూడా మీడియాటెక్‌ డైమెన్సిటీ

7300 ఎనర్జీ చిప్‌సెట్‌ ప్రాసెసర్‌ తో పనిచేస్తాయి. ఇలాంటే ఇందులో ఏఐ పనితీరును మెరుగుపరిచేందుకు ఇందులో MediaTek APU 655ని జోడించారు. ఇకపోతే ఈ ఫోన్ కెమెరా విషయానికొస్తే.. ఈ స్మార్ట్‌ ఫోన్‌ లో 50 మెగాపిక్సెల్స్‌ తో కూడిన సోనీ ఎల్‌వైటీ 600 రెయిర్ కెమెరాను, 50 ఎంపీతో కూడి సెకండరీ కెమెరాను, 8 ఎంపీతో కూడిన వైడ్‌ యాంగిల్‌ లెన్స్‌ ను ఇచ్చారు. ఇక 12 ప్రో విషయానికొస్తే ఇందులో 50ఎంపీ సోనీ LYT-600 ప్రైమరీ + 50ఎంపీ +8ఎంపీ ట్రిపుల్ కెమెరా సెటప్ ఇచ్చారు. సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం రెండు ఫోన్స్‌ లోనూ 32 ఎంపీతో కూడిన ఫ్రంట్ కెమెరాను కూడా అందించారు..

Exit mobile version