Oppo Reno 11F 5G Launch: మార్కెట్ లోకి విడుదలైన ఒప్పో రెనో కొత్త ఫోన్.. ధర, ఫీచర్స్ ఇవే?

చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారు దిగ్గజం ఒప్పో నుంచి రెనో 11ఎఫ్ 5జీ ఫోన్ లాంచ్ అయింది. ఈ మోడల్ జనవరిలో భారత మార్కెట్లో ఆవిష్కరించిన ఒప్పో రెనో

  • Written By:
  • Publish Date - February 9, 2024 / 03:13 PM IST

చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారు దిగ్గజం ఒప్పో నుంచి రెనో 11ఎఫ్ 5జీ ఫోన్ లాంచ్ అయింది. ఈ మోడల్ జనవరిలో భారత మార్కెట్లో ఆవిష్కరించిన ఒప్పో రెనో 11 5జీ, ఒప్పో రెనో 11 ప్రో 5జీ ఫోన్ల జాబితాలో చేరింది. ఈ సిరీస్‌లోని అన్ని హ్యాండ్‌సెట్‌లు ఆండ్రాయిడ్ 14-ఆధారిత కలర్ ఓఎస్ 14, ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్‌ లతో వస్తాయి. కొత్తగా లాంచ్ అయిన ఒప్పో రెనో 11ఎఫ్ 5జీ, మీడియాటెక్ డైమన్షిటీ 7050 చిప్‌సెట్‌తో ఆధారితమైనది. 64ఎంపీ ప్రైమరీ రియర్ కెమెరాతో వస్తుంది. ఈ ఫోన్ మొత్తం 3 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. సింగిల్ ర్యామ్ స్టోరేజ్ కాన్ఫిగరేషన్ కూడా కలిగి ఉంది. తాజాగా విడుదలైన ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన ధర ఫీచర్ల విషయానికొస్తే..

ఒప్పో రెనో 11ఎఫ్ 5జీ ధర టీహెచ్‌బీ 10,990 అనగా ఇండియన్ కరెన్సీ ప్రకారం దాదాపు రూ. 25,540 గా ఉంది. సింగిల్ 8జీబీ 256 జీబీ కాన్ఫిగరేషన్‌లో అందుబాటులో ఉంది. అయితే ప్రస్తుతం థాయ్‌లాండ్‌లో ఇ-కామర్స్ పోర్టల్ అయిన లాజాడా ద్వారా విక్రయిస్తోంది. ఈ మోడల్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేయడానికి కంపెనీ ఇంకా ప్రణాళికలను ప్రకటించలేదు. ఒప్పో రెనో 11ఎఫ్ 5జీ ఫోన్ దేశంలో ఒప్పో ఎఫ్25గా రానుందని గత లీక్ సూచించింది. ఒప్పో రెనో మోడల్ మనకు కోరల్ పర్పుల్, ఓషన్ బ్లూ, పామ్ గ్రీన్ కలర్ వంటి ఆప్షన్‌ లలో అందుబాటులో ఉంది. కాగా ఒప్పో రెనో 11ఎఫ్ 5జీ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే.. సరికొత్త ఒప్పో రెనో 11 సిరీస్ మోడల్ ఆండ్రాయిడ్ 14-ఆధారిత కలర్ఓఎస్ 14తో అందిస్తోంది.

6.7 అంగుళాల ఫుల్-హెచ్‌డీ +అమోల్డ్ డిస్‌ప్లేతో 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 240హెచ్‌జెడ్ టచ్ శాంప్లింగ్ రేట్, పిక్సెల్ 394 పీపీఐ రేట్‌తో వస్తుంది. గరిష్ట ప్రకాశాన్ని 1,100 నిట్‌ల వరకు అందిస్తుంది. డబుల్ టైమ్ రీన్‌ఫోర్స్డ్ పాండా గ్లాస్ ప్రొటెక్షన్ కూడా అందిస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ఎస్ఓసీ ద్వారా ఆధారితంగా పనిచేస్తుంది. ఒప్పో రెనో 11ఎఫ్ 5జీ ఏఆర్ఎమ్ మాలి జీ68 ఎంసీ4 జీపీయూ, 8జీబీ ఎల్‌పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జీబీ యూఎఫ్ఎస్ 3.1 ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో వస్తుంది. ర్యామ్ వర్చువల్‌గా మరో 8జీబీ వరకు విస్తరించుకోవచ్చు. కెమెరా విభాగంలో ఒప్పో రెనో 11ఎఫ్ 5జీ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్టుతో 64ఎంపీ ఓవీ64బీ ప్రైమరీ సెన్సార్, అల్ట్రావైడ్ లెన్స్‌తో కూడిన 8ఎంపీ సోనీ ఐఎమ్ఎక్స్355 సెన్సార్, వెనుకవైపు 2ఎంపీ మాక్రో షూటర్‌తో వస్తుంది.

ఫ్రంట్ కెమెరా 32ఎంపీ సోనీ ఐఎమ్ఎక్స్ 615 సెన్సార్‌ను కూడా పొందుతుంది. ఒప్పో రెనో 11ఎఫ్ 5జీని 5,000ఎంఎహెచ్ బ్యాటరీని అమర్చింది. 67డబ్ల్యూ సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్ విషయానికి వస్తే ఐపీ65 రేటింగ్, సెక్యూరిటీ కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో వస్తుంది. డ్యూయల్ నానో సిమ్-సపోర్ట్ ఉన్న ఒప్పో రెనో 11ఎఫ్ 5జీ వై-ఫై 6, బ్లూటూత్ 5.2, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, గెలీలియో, యూఎస్‌బీ టైప్-సి కనెక్టివిటీకి కూడా సపోర్టు ఇస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ పరిమాణం 161.1ఎమ్ఎమ్ x 74.7ఎమ్ఎమ్ x 7.54 ఎమ్ఎమ్, డివైజ్ బరువు 177గ్రాములు ఉంటుంది.