Site icon HashtagU Telugu

Oppo Reno 11: అద్భుతమైన ఫీచర్స్ ఒప్పో రెనో 11.. రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడో తెలుసా?

Mixcollage 09 Jan 2024 11 21 Am 4585

Mixcollage 09 Jan 2024 11 21 Am 4585

దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా రోజు రోజుకీ స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. అయితే ఈ మధ్య కాలంలో వినియోగదారులు ఎక్కువగా కెమెరా ఫీచర్స్ అధికంగా ఉన్న స్మార్ట్ ఫోన్ లను మాత్రమే ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఈ విషయాన్ని ద్రుష్టిలో ఉంచుకున్న స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు కెమెరా ఫీచర్స్ పై ఎక్కువ ఇంట్రెస్ట్ ని చూపిస్తూ తక్కువ ధరకే ఎక్కువ కెమెరా ఫీచర్స్ కలిగిన స్మార్ట్ ఫోన్ లను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. అలా ఇప్పటికే ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను మార్కెట్ లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. త్వరలోనే అలాంటి మరో సరికొత్త ఫోన్ విడుదల కానుంది. మరి ఆ వివరాల్లోకి వెళితే..

కాగా కెమెరా పరంగా ఒప్పో ఫోన్లు ఇటీవల కాలంలో ఎక్కువ ప్రజాదరణ పొందాయి. అయితే తాజాగా ఒప్పో తన అధికారిక వెబ్‌సైట్‌లో రెనో 11 సిరీస్‌కు సంబంధించిన ఇండియా లాంచ్ తేదీని ధ్రువీకరించింది. రెనో 10 సిరీస్‌ను విజయవంతం చేయడానికి లైనప్‌లో రెనో 11, రెనో 11 ప్రో స్మార్ట్‌ఫోన్‌లు ఉంటాయి. ఈ ఫోన్‌ను భారతదేశంలో జనవరి 12, 2024న ఉదయం 11:00 ప్రారంభిస్తున్నట్లు కంపెనీ తన అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది. భారతదేశంలో రెనో 11 సిరీస్‌ను ఫస్ట్ లుక్‌తో పాటు లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించిన కొన్ని రోజుల తర్వాత లాంచ్ డేట్ కన్ఫర్మేషన్ వచ్చింది. ఈ అప్పో రెనో 11 సిరీస్‌ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.. అప్పో రెనో 11, రెనో 11 ప్రోకు సంబంధించి ఫీచర్లను పరిశీలిస్తే ఈ ఫోన్లు లైనప్ 32 ఎంపీ టెలిఫోటో పోర్ట్రెయిట్ కెమెరాను కలిగి ఉంది.

అలాగే బ్రాండ్ న్యూ కలర్‌ ఓఎస్‌ 14తో పని చేస్తుంది. ప్రామాణిక మోడల్ 67 వాట్స్‌ సూపర్‌ వీఓఓసీ ఫ్లాష్ ఛార్జ్‌కు మద్దతు ఇస్తుంది. అయితే ప్రో మోడల్ 80 వాట్స్‌ సూపర్‌ వీఓఓసీ ఫ్లాష్ ఛార్జ్ మద్దతుతో వస్తుంది. అప్పో భాగస్వామ్యం చేసిన చిత్రాల ఆధారంగా రెనో 11, రెనో 11 ప్రో రెండూ వెనుకవైపు మూడు కెమెరా సెన్సార్‌లను కలిగి ఉన్నాయి. అవి విచిత్రమైన బంప్‌లో ఉన్నాయి. ప్రో కెమెరా మాడ్యూల్ దాని చైనీస్ కౌంటర్‌తో సమానంగా కనిపిస్తున్నప్పటికీ ప్రామాణిక పరికరంలో సెన్సార్ ప్లేస్‌మెంట్ కొంచెం భిన్నంగా ఉంటుంది. ఈ ఫోన్‌ చూడడానికి ప్రో వేరియంట్‌కు భిన్నంగా ఉంటుంది. ఒప్పో నవంబర్ 2023లో తన హోమ్ మార్కెట్లో రెనో 11 సిరీస్‌ని ప్రారంభించింది. చైనాలో రిలీజ్‌ చేసిన ఈ వేరియంట్ 120 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్ రేట్, హెచ్‌డీఆర్‌ 10+ మద్దతుతో ఓఎల్‌ఈడీ స్క్రీన్‌లను కలిగి ఉంది.

రెనో 11 4 ఎన్‌ఎం మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్‌తో వస్తుంది. అయితే ప్రో మోడల్‌లో 4 ఎన్‌ఎం క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8+ జెన్‌ 1 ప్రాసెసర్ ఉంటుంది. ఇక కెమెరా విషయానికి వస్తే ఓఐఎస్‌తో కూడిన 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 2 ఎక్స్‌ ఆప్టికల్ జూమ్‌తో 32 ఎంపీ టెలిఫోటో సెన్సార్, 112 డిగ్రీ ఫీల్డ్ వ్యూతో 8 ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. అలాగే 32 ఎంపీ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ప్రామాణిక మోడల్ 67 వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,800 mAh బ్యాటరీని కలిగి ఉంది. అయితే ప్రో మోడల్ 80 వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,700 ఎంఏహెచ్‌ బ్యాటరీతో వస్తుంది. అయితే ఇండియా లాంచ్‌కు సంబంధించి ఒక తేదీ వచ్చినా ఈ ఫోన్‌ ఫీచర్ల గురించి మాత్రం మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.