Site icon HashtagU Telugu

Oppo A58 4G: మార్కెట్ లోకి మరో ఒప్పో కొత్త స్మార్ట్ ఫోన్.. ధర ఫీచర్స్ ఇవే?

Oppo A58 4g

Oppo A58 4g

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ ఫోన్ బ్రాండ్ ఒప్పో ఎప్పటికప్పుడు అతి తక్కువ బడ్జెట్ లో మంచి మంచి ఫీచర్స్ కలిగిన స్మార్ట్ ఫోన్ లను మార్కెట్ లోకి విడుదల చేస్తూనే ఉంది. ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఒప్పో సంస్థ తాజాగా మార్కెట్ లోకి మరో కొత్త స్మార్ట్ ఫోన్ ని విడుదల చేసింది. ఆ వివరాల్లోకి వెళితే.. ఒప్పో సంస్థ ఏ58 పేరుతో 4జీ స్మార్ట్ ఫోన్‌ను లాంచ్‌ చేశారు. 6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ ఫోన్‌ ధర రూ. 14,999గా ఉంది.

కాగా ఈ ఫోన్ ఈ నెల 10 నుంచి భారత మార్కెట్ లోకి అందుబాటులోకి రానుంది. ఇకపోతే ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 6.72 ఇంచెస్‌ ఫుల్‌ హెచ్‌డీ + డిస్‌ప్లేను అందించారు. విత్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ ఈ స్క్రీన్‌ సొంతం. మీడియా టెక్‌ హెలియో జీ85 ప్రాసెసర్‌ను అందించారు. 2.8డీ కర్వ్‌డ్ బాడీ, గ్లోయింగ్ స్కిల్ డిజైన్‌ ఈ ఫోన్‌ సొంతం. ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేసే ఈ స్మార్ట్ ఫోన్‌లో డ్యుయల్ స్టీరియో స్పీకర్లను అందించారు. ఇక సెక్యూరిటీ కోసం ఇందులో బ్యాక్ ప్యానెల్‌పై ఫింగర్ ప్రింట్ రెసిస్టెంట్ సెన్సర్‌ను అందించారు. అలాగే ఈ ఫోన్ 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యంను కలిగి ఉండనుంది.

ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ కెమెరా విషయానికొస్తే.. ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగా పిక్సెల్ రెయిర్‌ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం 8 మెగా పిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాను కూడా అందించారు. కాగా ఈ స్మార్ట్ ఫోన్ కి సంబందించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ మనకు రెండు మూడు కలర్ లలో లభించనున్నట్లు తెలుస్తోంది. తక్కువ బడ్జెట్ తో మంచి కెమెరా కావాలి అనుకున్న వాrరు ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు.