Site icon HashtagU Telugu

Oppo Reno 11A: ఒప్పో నుంచి మార్కెట్ లోకి మరో సరికొత్త స్మార్ట్ ఫోన్.. ధర, ఫీచర్స్ ఇవే?

Mixcollage 23 Jun 2024 02 13 Pm 1478

Mixcollage 23 Jun 2024 02 13 Pm 1478

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం ఒప్పో సంస్థ మార్కెట్ లోకి ఇప్పటికే ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది. అంతే కాకుండా ఇప్పటికే మార్కెట్లోకి విడుదల చేసిన స్మార్ట్ ఫోన్ల లలో వేరియేషన్ లను కూడా విడుదల చేస్తోంది. ఇది ఇలా ఉంటే త్వరలోనే ఒప్పో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసేందుకు సిద్ధమవుతోంది. ఒప్పో రెనో 11ఏ పేరుతో ఈ ఫోన్‌ను తీసుకురాబోతోంది. ప్రీమియం లుక్‌తో మంచి ఫీచర్లతో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు.

అయితే ఇప్పటికే జపాన్‌లో లాంచ్‌ అయిన ఈ ఫోన్‌ను త్వరలోనే భారత మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. మరి ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన ధర ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో 67 వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే పవర్‌ఫుల్ బ్యాటరీని అందించారు. ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై పనిచేసే ఈ ఫోన్‌లో సెక్యూరిటీ కోసం ఇన్‌ స్క్రీన్ ఫింగర్‌ ప్రింట్ సెన్సార్‌ ను అందించారు. ఇక ఇందులో 6.7 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌ హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్‌ స్క్రీన్‌ను అందించారు. 120Hz రిఫ్రెష్ రేట్ ఈ స్క్రీన్ సొంతం. ఈ ఫోన్‌ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో ఈ ఫోన్‌ తీసుకొచ్చారు.

ఇకపోతే కెమెరా విషయానికొస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 64 మెగా పిక్సెల్స్‌ తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ లెన్స్, 2-మెగాపిక్సెల్ మాక్రో కెమెరాలను ఇచ్చారు. సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 32 మెగాపిక్సెల్స్‌ తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను కూడా అందించారు. ఇక ధర విషయానికొస్తే.. ఒప్పో రెనో 11ఏ 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 48,800గా ఉండొచ్చని అంచనా. కాగా ఈ స్మార్ట్ ఫోన్ ఈ నెల అనగా జూన్‌ 27వ తేదీన ఈ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.