Site icon HashtagU Telugu

Oppo : మార్కెట్ లోకి ఒప్పో సరికొత్త స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ మాములుగా లేదుగా?

Oppo Launches New Smart Phone With Excellent Features

Oppo Launches New Smart Phone With Excellent Features

Oppo Smart Phone : చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం ఒప్పో సంస్థ మార్కెట్ లోకి ఇప్పటికే ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. వినియోగదారులను ఆకర్షించడం కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది ఒప్పో సంస్థ. అంతేకాకుండా ఇప్పటికే మార్కెట్లోకి విడుదల చేసిన స్మార్ట్ ఫోన్ల లోనే వేరియేషన్లను కూడా విడుదల చేస్తోంది. ఈ నేపథ్యంలోనే మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ ని మార్కెట్లోకి విడుదల చేయబోతోంది. రెనో 11 పేరుతో ఈ స్మార్ట్ ఫోన్‌ను తీసుకొస్తున్నారు.

We’re Now on WhatsApp. Click to Join.

అయితే మొదట చైనా మార్కెట్లో ఈ ఫోన్‌ను లాంచ్‌ చేయనున్నారు. అనంతరం భారత మార్కెట్లోకి తీసుకురానున్నట్లు సమాచారం. మరి ఆ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన ధర ఫీచర్ల విషయానికి వస్తే.. ఒప్పో రెనో 11 (Oppo Reno 11) స్మార్ట్ ఫోన్ మనకు రెండు వేరియేషన్లలో లభించునుంది. అందులో ఒకటి ఒప్పో రెనో 11, రెండు ఒప్పో రెనో 11 ప్రో. అయితే చైనాలో ఇప్పటికే ఈ ఫోన్‌ ప్రీ-బుకింగ్స్‌ను ప్రారంభించాయి. ఈ ఫోన్‌లో ఫ్లాగ్‌ షిప్‌ ఇమేజింగ్ ఆల్గరిథమ్‌ను ఇవ్వనున్నారు. ఈ స్మార్ట్ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 ఎస్‌ఓసీ చిప్‌సెట్ ప్రాసెస్‌ను అందించనున్నారు. ఈ స్మార్ట్‌ ఫోన్‌ను ఫ్లూరైట్‌ బ్లూ, టర్క్యౌజ్‌, ఒబ్సిడియాన్‌ బ్లాక్‌ కలర్స్‌లో తీసుకురానున్నారు.

ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ కెమెరా విషయానికొస్తే.. ఒప్పో రెనో 11 (Oppo Reno 11) ఫోన్‌లో 50 మెగా పిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను కూడా అందించారు. ఎస్ఎల్ఆర్ పొర్ట్రైట్ లెన్స్ కెమెరా, 32-మెగా పిక్సెల్ సెన్సర్ విత్ 47 ఎంఎం ఫోకల్ లెంత్ సెన్సర్‌ను ఇవ్వనున్నారు. ఈ స్మార్ట్ ఫోన్‌లో 4700 ఎమ్‌ఏహెచ్‌ సూపర్‌ వూక్‌ ఛార్జింగ్‌ను అందిచనున్నారు. యూఎస్‌బీ టైప్‌సీ పోర్ట్ను అందించనున్నారు. ఫింగర్‌ప్రింట్‌ సెన్సర్‌ను కూడా ఇవ్వనున్నారు. కాగా నవంబర్‌ 23వ తేదీన చైనా మార్కెట్లో ఈ ఫోన్‌ను లాంచ్‌ చేయనున్నారు.

Also Read:  Lawyers Vs ChatGPT : లాయర్లకు ‘ఛాట్‌ జీపీటీ’ ఝలక్.. నమ్ముకుంటే నట్టేట ముంచుతోందట !